Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్మీత్‌ రోజు కూలీ రూ.20 - కూరగాయల మొక్కలు పెంచుతున్న డేరా బాబా

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ గుర్మీత్ రాం రహీం సింగ్ జైలులో కూరగాయలు పండిస్తున్నాడు. దీంతో ఆయనకు రోజుకు రూ.20 చొప్పున జైలు అధికారులు కూలీ చెల్లిస్తున్

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (09:46 IST)
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా చీఫ గుర్మీత్ రాం రహీం సింగ్ జైలులో కూరగాయలు పండిస్తున్నాడు. దీంతో ఆయనకు రోజుకు రూ.20 చొప్పున జైలు అధికారులు కూలీ చెల్లిస్తున్నారు. 
 
డేరా సచ్చా సౌధాలో సకలభోగాలు అనుభవిస్తూ అత్యంత విలాసవంతమైన జీవితం గడిపిన గుర్మీత్‌ ఇపుడు దిన కూలీగా మారారు. జైలులో 8 గంటలు పనిచేస్తున్నాడు. జైలుశిక్ష కాలంలో కూరగాయల మొక్కలు పెంచుతూ, చెట్ల కొమ్మలను కత్తిరిస్తున్నాడు. జైలులో గుర్మీత్‌ గది పక్కనే కొంత ఖాళీ స్థలం ఉందనీ, అందులో కూరగాయలు పండిస్తున్నాడని హర్యానా జైళ్ల శాఖ డీజీపీ వెల్లడించారు. 
 
పైగా, గుర్మీత్‌ జైలులో ఎంతో క్రమశిక్షణతో మెలుగుతున్నాడనీ, ఆయనకు జైలులో ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం లేదనీ, ఇందుకు సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని డీజీపీ వివరణ ఇచ్చారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా గుర్మీత్‌కు ఇతర ఖైదీలతో సంబంధం లేకుండా ఆయన గదిని కొంతదూరంగా ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments