Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాంకు సిబ్బందికి ధన దాహం... 44 నకిలీ ఖాతాల సృష్టి.. రూ.100 కోట్ల బ్లాక్ మనీ డిపాజిట్

పెద్దనోట్లు రద్దు చేసి అవినీతి, నల్లడబ్బు మకిలిని వదలగొడదామని ప్రధానమంత్రి మోదీ అనుకుంటే దానికి తూట్లు పొడుస్తున్నారు కొంతమంది బ్యాంకు సిబ్బంది, మరికొంతమంది పోస్టల్ అధికారులు. దేశంలో పలు బ్యాంకు ఖాతాల్లో జరుగుతున్న లావాదేవీలను చూస్తుంటే ఐటీ శాఖకు కళ్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (18:56 IST)
పెద్దనోట్లు రద్దు చేసి అవినీతి, నల్లడబ్బు మకిలిని వదలగొడదామని ప్రధానమంత్రి మోదీ అనుకుంటే దానికి తూట్లు పొడుస్తున్నారు కొంతమంది బ్యాంకు సిబ్బంది, మరికొంతమంది పోస్టల్ అధికారులు. దేశంలో పలు బ్యాంకు ఖాతాల్లో జరుగుతున్న లావాదేవీలను చూస్తుంటే ఐటీ శాఖకు కళ్లు బైర్లు కమ్ముతున్నంత పని అవుతోంది. 
 
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని చాందినీచౌక్‌ యాక్సిస్ బ్యాంకు బ్రాంచిలో నవంబరు 8 నుంచి ఇప్పటివరకూ ఏకంగా రూ. 450 కోట్లు డిపాజిట్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ కావడంతో ఐటీ అధికారులు పోలీసులతో కలిసి ఆ బ్యాంకు లావాదేవీలను శుక్రవార నాడు తనిఖీలు చేశారు. ఇందులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. 
 
అదేంటంటే... ఆ బ్యాంకులో 44 న‌కిలీ ఖాతాలు ఓపెన్ చేసి ఉండటం. మరి నకిలీ ఖాతాలను తెరిచేందుకు బ్యాంకు మేనేజర్ ఎలా అనుమతించారన్నది అలా వుంచితే ఆ ఖాతాల్లో ఏకంగా రూ. 100 కోట్ల నల్లడబ్బు జ‌మ అయిన‌ట్లు తేలింది. దీనితో వ్యవహారాన్ని మరింత లోతుగా పరిశీలిస్తున్నారు. ఇంకా దేశంలోని ప్రధాన నగరాల్లోని ఇతర బ్యాంకుల్లోనూ తనిఖీలు జరుపుతున్నట్లు సమాచారం.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments