Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత రూ.500 నోటుతో కరెంటు పుట్టించిన కుర్రాడు....

భువనేశ్వర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాక నోటు సిత్రాలు చాలా చూసుంటారు. సోషల్ మీడియా వేదికగా కొందరు చిత్రవిచిత్ర పనులు చాలానే చేశారు. పాత నోట్లకు దండేయడం, రిప్ అని పెట్టడం, పకోడీలు కట్టడం ఇలాంటి చాలా ఫోటోలు నెట

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (17:49 IST)
భువనేశ్వర్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాత నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాక నోటు సిత్రాలు చాలా చూసుంటారు. సోషల్ మీడియా వేదికగా కొందరు చిత్రవిచిత్ర పనులు చాలానే చేశారు. పాత నోట్లకు దండేయడం, రిప్ అని పెట్టడం, పకోడీలు కట్టడం ఇలాంటి చాలా ఫోటోలు నెట్‌లో హల్‌చల్ చేశాయి. కానీ, ఒడిస్సాకు చెందిన ఈ కుర్రాడు అందరిలా చేయడం ఇష్టంలేక కొత్తగా ట్రై చేశాడు. పాతనోట్ల నుంచి కరెంట్ పుట్టించాడు. లచ్మన్ దుండి అనే ఇంటర్మీడియట్ సైన్స్ గ్రూప్ స్టూడెంట్ స్వగ్రామం ఒడిస్సాలోని కొటమల్.
 
ఏదైనా కొత్తగా చేయాలన్న తపన ఇతన్ని 500 నోటు నుంచి కరెంట్ పుట్టించేలా చేసింది. ఆ కరెంట్‌తో బల్బును వెలిగించి అందరినీ అబ్బురపరిచాడు. నోటు నుంచి విద్యుత్ ఎలా సాధ్యం అని స్థానికుల్లో అనుమానాలు తలెత్తాయి. అయితే లచ్మన్ దానిపై వివరణ ఇచ్చాడు. 500 నోటుపై సూర్యకాంతి కానీ, ఏదైనా వెలుతురు కానీ పడితే దానిపై ఉన్న సిలికాన్ ప్లేట్ వల్ల ఉష్ణం పుడుతుందని, దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని చెప్పాడు. ఈ కుర్రాడి ప్రయత్నాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సాధించగలడని చెబుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: 23ఏళ్ల వయస్సులో మూడోసారి తల్లి అయిన శ్రీలీల?

ప్రభాస్ ఇటలీ నుండి తిరిగి వచ్చాడు : రాజాసాబ్ పై అసంత్రుప్తి ?

హిట్ 4లో కార్తీ క్రికెట్ బెట్టింగ్ పాత్ర, హిట్ 6 లో విశ్వక్ వుంటారు : డైరెక్టర్ శైలేష్ కొలను

నాకు కూడా డాన్స్ అంటే చాలా ఇష్టం : #సింగిల్‌ హీరోయిన్ ఇవానా

కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments