Webdunia - Bharat's app for daily news and videos

Install App

'స్పా' పేరుతో అమ్మాయిలతో వ్యభిచారం.. రేటు కార్డులు కూడా...

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (13:57 IST)
ఢిల్లీలో ఓ స్పా సెంటరులో అమ్మాయిల పేరుతో వ్యభిచారం చేస్తున్న వ్యవహారాన్ని పోలీసులు వెలుగులోకి తెచ్చారు. ఈ స్పా సెంటరుకు వచ్చే విటులకు ముందుగా అందమైన అమ్మాయిల ఫోటోలతో పాటు రేటు కార్డులు అందజేస్తారు. తమ ఆర్థిక స్థోమతకు తగిన విధంగా అమ్మాయిలను ఎంచుకునే వెసులుబాటును కల్పిస్తారు. 
 
ఢిల్లీలోని స్పాలలో నిర్వహిస్తున్న వ్యభిచార రాకెట్లపై ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఇటీవల పలు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోని దిగిన ఢిల్లీ మహిళా కమిషన్... జస్ట్ డయల్‌పై దర్యాప్తు చేయడానికి ఒక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దక్షిణ ఢిల్లీలో ఉన్న స్పాల వివరాలను అందించాలని కమిషన్ బృందం కోరింది. 24 గంటల్లో కొన్ని స్పాల బాగోతాలపై మహిళా కమిషన్‌కు 15 కాల్స్, 32 వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయి. 
 
ఈ స్పాలలో 150 కంటే ఎక్కువ మంది యువతుల చిత్రాలతో పాటు వారి సేవల రేట్లు ఇచ్చారు. ఒక ఫోన్ నంబర్ నుంచి ఒక సందేశం వచ్చింది, అందులో స్పా ద్వారా ఒక యువతి చిత్రాన్ని పంపారు. దాని తర్వాత అసభ్యకరమైన సందేశాలు వచ్చాయి. మరో ఫోన్ నంబర్ నుంచి వచ్చిన మరో సందేశంలో 14 మంది యువతుల ఫొటోలు ఇచ్చారు. 
 
కమిషన్ బృందం స్పా సేవల వివరాలను అందించాలని అభ్యర్థించగా, అమ్మాయి కోసం అభ్యర్థనగా భావించి స్పాల మాటున సాగిస్తున్న అక్రమ వ్యభిచార కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను వెంటనే అందించారు. దీంతో స్పాల మాటున వ్యభిచారం సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే వాటిపై కేసులు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌ను కమిషన్ కోరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగ్ ఉన్నందున హాజరుకాలేదు.. కాస్త సమయం ఇవ్వండి : ఈడీని కోరిన మహేశ్ బాబు

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

తర్వాతి కథనం
Show comments