ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వదేశానికి చేరుకున్నారు. ఆయన చేపట్టిన ఐదు రోజుల విదేశీ పర్యటనను విజయవంతంగా ముంగించుకుని స్వదేశానికి వచ్చారు. ఇటలీ, యూకే పర్యటన ముగించుకొని ఢిల్లీలో దిగారు.
ఈ పర్యటనలో భాగంగా జీ20, కాప్26 ప్రపంచ వాతావరణ సదస్సుల్లో పాల్గొన్నారు. ఇటలీ పర్యటనలో భాగంగా వాటికన్ సిటీని సైతం మోడీ సందర్శించారు. క్రైస్తవ మతగురువు, క్యాథలిక్ చర్చిల అధినేత పోప్ ఫ్రాన్సిస్‌ను కలిశారు. భారత్‌కు రావాలని పోప్‌ను మోడీ ప్రత్యేకంగా ఆహ్వానించారు.