Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో దారుణం: 12 ఏళ్ల బాలుడిపై సామూహిక అత్యాచారం.. నిర్భయలా?

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2022 (12:37 IST)
ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. దేశ రాజధానిలో అబ్బాయిలకు కూడా భద్రత లేకుండా పోయింది. నలుగురు కామాంధులు 12 ఏళ్ల బాలుడిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. దానితో వదలకుండా క్రూరంగా ప్రవర్తించారు. అనంతరం కర్రలతో దారుణంగా కొట్టారు. 
 
చావుబతుకుల మధ్య కొట్టాడుతున్న ఆ బాలుడిని అక్కడే వదిలేసి పరారయ్యారు. కొనఊపిరితో ఉన్న బాధితుడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆ బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నాడని వైద్యులు వెల్లడించారు.
 
ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్ స్వాతి మలివాల్‌ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో అమ్మాయిలకే కాదు.. కనీసం అబ్బాయిలకు కూడా భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
12 ఏళ్ల బాలుడిపై నలుగురు వ్యక్తులు దారుణంగా లైంగిక దాడికి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం కర్రలతో దారుణంగా కొట్టడంతో చావుబతులకు మధ్య ఆసుపత్రిలో ఉన్నాడని తెలిపారు. 
 
మహిళా ప్యానెల్ ఈ ఘటనను గుర్తించి పోలీసులతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించిందని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నివేదిక ఇవ్వాలని ఢిల్లీ పోలీసులను కోరినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 
ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం