Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెవిలో తుపాకీతో కాల్చుకున్న భర్త.. భార్య మెడలోకి వెళ్లిన బుల్లెట్

Webdunia
ఆదివారం, 24 మే 2020 (17:11 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగంది. భార్యను బయపెట్టాలన్న ఉద్దేశ్యంతో ఓ భర్త చెవిలో తుపాకీ పెట్టుకుని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఆ తుపాకీ పొరపాటున పేలింది. అంతే.. బుల్లెట్ ఒక్కసారిగా అతని చెవిలో నుంచి భార్య మెడలోకి దిగింది. దీంతో భర్త పరిస్థితి విషమంగా ఉంటే.. భార్య మాత్రం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గురుగ్రామ్‌కు సమీపంలోని రామ్‌పురా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి గత 2017లో ఓ మహిళతో వివాహమైంది. ఆమెను వదిలివేశాడు. ఆతర్వాత మధురకు వచ్చి మరో యువతిని 2019లో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి రామ్‌పూరాలో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. 
 
అయితే, లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ భార్యతో గొడవపడుతుండేవాడు. అతడి భార్య ఏడు నెలల గర్భిణి. భార్యను తీసుకొని ఆసుపత్రికి ఎస్‌యూవీ కారులో అతడు బయలుదేరాడు. అయితే, మార్గమధ్యంలో ఉద్యోగ విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భార్యను బెదిరించేందుకు తుపాకీని చెవిదగ్గర పెట్టుకున్నాడు. అయితే, అతని చేయి పొరపాటున టిగ్గర‌ తగలడంతో పేలింది. 
 
బుల్లెట్ మాత్రం అతని చెవిలో నుంచి దూసుకెళ్లి బయటకు వచ్చి... పక్కనే ఉన్న భార్య మెడలో కూడా దిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వారిద్దరిని ఢిల్లీలోని సప్ధర్‌జంగ్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భర్త ఐసీయూలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది. అతడి భార్య ప్రాణాలతో బయటపడిందని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్డ్జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

రమణారెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన పద్మశ్రీ, డాక్టర్ బ్రహ్మానందం

నటుడు సోనూసూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం

ప్రముఖ సినీ గేయరచయిత కులశేఖర్ ఇకలేరు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments