Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫీసుకు వెళ్లి వచ్చేందుకు సమయం పడుతుంది.. తొలి ఉద్యోగానికి రిజైన్

Webdunia
గురువారం, 10 ఆగస్టు 2023 (13:48 IST)
ఈ రోజుల్లో ఉద్యోగం దొరకడం మహాభాగ్యంగా భావిస్తున్నారు. ఉద్యోగం చేసే కంపెనీ ఎంత దూరంలో ఉన్నా ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి వెళ్లి వస్తుంటారు. అయితే, ఇక్కడో వ్యక్తి మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకున్నాడు. తనకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ చాలా దూరంలో ఉందని, వెళ్లి వచ్చేందుకు చాలా సమయం పడుతుందని పేర్కొంటూ తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ప్రయాణ సమయంతో పాటు ఆఫీసు పనివేళలు పోగా తనకు రోజులో కేవలం మూడు గంటల సమయం మాత్రమే మిగులుతుందని భావించి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీలోని వాయువ్య ప్రాంతంలో నివసించే సదరు వ్యక్తి మంచి వేతనంతో ఓ కంపెనీలో ఉద్యోగ ప్రతిపాదనను అంగీకరించినట్టు తన పోస్టులు తెలిపారు. అయితే, గురుగ్రామ్‌లోని తన కార్యాలయానికి వెళ్లి రావడంతో ఒక రోజులో అతనికి మూడు గంటలు మాత్రమే ఖాళీ సమయం మిగిలిందని వాపోయాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆఫీస్ దగ్గరికి మకాం మార్చే ఉద్దేశం లేకపోవడంతో తనకు వచ్చిన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. ఈ అనుభవాలను రెడిట్ పోస్టులో షేర్ చేశాడు. ఈ పోస్టుకు ఒక్క రోజులోనే 400కు పైగా ఓట్లు వచ్చాయి. అయితే, కొందరు అతని నిర్ణయాన్ని తప్పుబట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిక్‌గా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడాన్ని చూసి పాదాభివందనం చేయాలనిపించింది: దిల్ రాజు

Pushpa-2 కొత్త రికార్డ్-32 రోజుల్లో రూ.1,831 కోట్ల వసూలు.. బాహుబలి-2ను దాటేసింది..

Nayanthara: మళ్లీ వివాదంలో చిక్కుకున్న నయనతార.. ధనుష్ బాటలో చంద్రముఖి?

Honey Rose: హనీ రోజ్‌ను వేధించిన ఆ ధనవంతుడు ఎవరు?

ఇద్దరు అభిమానుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments