భార్యను వ్యభిచారం చేయమన్నాడు.. నిరాకరించిందని ఏం చేశాడో తెలుసా?

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (17:25 IST)
భార్యాభర్తల అనుబంధానికి మనదేశ సంస్కృతినే పుట్టినిల్లు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల కాలం గడుస్తుండటంతో భార్యాభర్తల అనుబంధం కాదు.. మానవీయ విలువలే మంటగలిసిపోతున్నాయి.

కానీ ఇక్కడ కథేంటంటే.. భార్యను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన ఈ మూర్ఖుడైన భర్త.. ఆమెను వ్యభిచార రొంపిలోకి దించాలని చూశాడు.

తన అవసరాల కోసం భార్యతో వ్యభిచారం చేయించాలని చూసాడు ఆమె ఒప్పుకోక పోవడంతో మానవత్వం మరచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన డిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. జలీల్ షేక్ అనేవ్యక్తి ఫతీమా సర్దార్ అనే మహిళను కొన్నేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. కొంత కాలంగా ఆమెను వ్యభిచారం చేయాలంటూ నిత్యం వేధించసాగాడు.

ఇందుకు ఆమె నిరాకరించడంతో జలీల్ ఆమెను ఆగస్టు ఐదో తేదీన హతమార్చాడు. ఆమె మృతదేహాన్ని ఓ ప్లాస్టిక్ సంచీలో పెట్టి డ్రైనేజీలో పడేశాడు. 
 
స్థానికులు ఆమె మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు రంగంలోకి దిగి.. కేసును దర్యాప్తు చేయడం మొదలెట్టారు. చివరికి బాధితురాలి బంధువులు జలీల్ షేకే భార్యను చంపివుంటాడని అనుమానం వ్యక్తం చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. 
 
భార్యను వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెంచానని.. ఆమె అంగీకరించకపోవడంతో హతమార్చినట్లు పోలీసులతో జలీల్ ఒప్పుకున్నాడు. దీంతో అతనిని అదుపులోకి తీసుకుని అతడిపై హత్యనేరం కింద కేసునమోదు రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments