Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోర్న్ స్టార్‌లా డ్రెస్ వేసుకోమని వేధిస్తున్నాడు.. భార్య ఫిర్యాదు

Webdunia
బుధవారం, 5 జులై 2023 (15:41 IST)
అశ్లీల వీడియోలకు బానిసైన ఓ వ్యక్తి తన భార్య (30) పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అశ్లీల వీడియోలు చూసే అలవాటు ఉన్న తన భర్త.. ఆ వీడియోలను చూడాలని, పోర్న్‌స్టార్‌ తరహాలో దుస్తులు ధరించాలంటూ తనపై ఒత్తిడి చేస్తూ తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆరోపించింది. ఈ మేరకు ఆమె పశ్చిమ రోహ్‌తాస్ నగర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 
 
అంతేకాకుండా తన భర్త, అతడి కుటుంబ సభ్యులు కట్నం కోసం డిమాండ్‌ చేస్తున్నారని, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారంటూ ఫిర్యాదులో ఆమె పేర్కొన్నట్టు సీనియర్‌ పోలీస్‌ అధికారి వెల్లడించారు. వీరిద్దరికీ 2020లో వివాహం జరిగినట్టు తెలిపారు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు డీసీపీ రోహిత్‌ మీనా తెలిపారు. కేసును విచారిస్తున్నట్టు చెప్పారు. 
 
సిగరెట్ కాల్చిన వధువు తల్లి - పెళ్లి రద్దు చేసుకున్న వరుడు... 
 
కొన్ని సంఘటనలు వినేందుకు విచిత్రంగా ఉంటాయి. కొందరి చేష్టలు వినడానికి ఆసక్తిగాను ఉంటాయి. మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. అయితే, ఇక్కడో వరుడు కాబోయే భార్య తల్లి వివాహ వేడుకలో సిగరెట్ కాల్చిందన్న కోపంతో ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్నాడు. ఆ తర్వాత పంచాయతీ పెద్దల జోక్యంతో శాంతించి మళ్లీ పెళ్లికి అంగీకరించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
గత నెల 27వ తేదీన కళ్యాణ మండపానికి చేరిన వరుడు వివాహానికి ముందు జరిగిన వేడుకలో తనకు కాబోయే అత్తగారు సిగరెట్ తాగుతూ నృత్యం చేయడాన్ని కళ్లారా చూసి ఒకింత షాక్‌కు గురయ్యాడు. సభ్యత, సంప్రదాయం లేకుండా ఇలా సిగరెట్ తాగడమేంటని నిలదిస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 
 
అంతటితో అతను శాంతించలేదు. పైగా, తక్షణం వివాహాన్ని నిలిపివేయించాడు. పెళ్లి రద్దు చేస్తున్నట్టు ప్రకటించి తన బంధువులతో మండపం నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయంపై గ్రామపెద్దలు పంచాయతీ నిర్వహించి వరుడికి నచ్చజెప్పడంతో మళ్లీ పెళ్లి జరిగింది. దీంతో ఈ వివాహ కథ సుఖాంతమైంది. 
 
75 యేళ్ల సుధీర్ఘ పోరాటం... 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలే
 
ఆదివాసీ ప్రజల 75 యేళ్ల సుధీర్ఘ పోరాటానికి ప్రతిఫలం దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్ ప్రాంతాలేనని తెలిపింది. ఆ గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భుయాన్ బెంచ్ సారథ్యంలోని ధర్మాసనం బుధవారం సంచలన తీర్పునిచ్చింది. 
 
అదేసమయంలో సింగిల్ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోలేమన్న సీజే ధర్మాసనం ఆదివాసీయేతరుల అప్పీల్‌ను కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఫలితంగా 75 యేళ్ల పాటు ఆదివాసీలు నిర్వహించిన పోరాటానికి ఫలితం దక్కింది. వీరంతా పట్టువదలని విక్రమార్కుల్లా పోరాటం సాగించి చివరకు విజయాన్ని సొంతం చేసుకున్నారు. 
 
కాగా, ఆదివాసుల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాజ్యాంగ పరిధిలోని ఐదో షెడ్యూల్‌ పరిధిలోకి సదరు 23 గ్రామాలు రావంటా ఆదివాసీయేతర రాజకీయ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఎట్టకేలకు ఆదివాసీలకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం