Webdunia - Bharat's app for daily news and videos

Install App

తప్పిపోయి ఢిల్లీకొచ్చింది.. రేప్‌కు గురైంది.. ఆపై రూ.70వేలకు సేలైపోయింది..

పాపం ఆ చిన్నారి తప్పిపోయింది. ఇలా ఎలాగో ఢిల్లీకి చేరుకుంది. అయితే అక్కడే ఆ బాలికను దురదృష్టం వెంటాడింది.15 ఏళ్ల ఓ బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు బాలికపై అత్యాచారానికి పాల్పడి.. ఆపై రూ.70వేలకు విక్రయి

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2017 (12:55 IST)
పాపం ఆ చిన్నారి తప్పిపోయింది. ఇలా ఎలాగో ఢిల్లీకి చేరుకుంది. అయితే అక్కడే ఆ బాలికను దురదృష్టం వెంటాడింది.15 ఏళ్ల ఓ బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు బాలికపై అత్యాచారానికి పాల్పడి.. ఆపై రూ.70వేలకు విక్రయించిన వైనం తాజాగా వెలుగుచూసింది.

అచ్చం సినిమాలోలాగా బాలికపై జరిగిన రేప్, విక్రయ వ్యవహారంపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 363, 366, 376, 328,506, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఎయిమ్స్‌కు పంపించి నిందితులైన పప్పుయాదవ్, అఫ్రోజ్‌లను అరెస్టు చేశారు.
 
వివరాల్లోకి వెళితే... చత్తీస్‌ఘడ్ కు చెందిన 15 ఏళ్ల ఓ బాలిక బంధువుల ఇంటికి వెళుతూ పొరపాటున ఢిల్లీకి వెళ్లే రైలు ఎక్కింది. ఢిల్లీ రైల్వే స్టేషనుకు చేరిన మైనర్ బాలికను నీళ్ల బాటిళ్లు విక్రయించే ఆర్మాన్ అనే యువకుడు సరాయి కాలేఖాన్ ప్రాంతంలోని ఇంటికి తీసుకువెళ్లి భార్య హసీనా సహకారంతోనే అత్యాచారం చేశాడు. ఆపై బాలికను పప్పు యాదవ్ అనే యువకుడికి రూ.70వేలకు విక్రయించగా అతడు పెళ్లి చేసుకుని వేధింపులు మొదలెట్టాడు. 
 
అతని వేధింపుల బారి నుంచి తప్పించుకునేందుకు.. బాలిక పప్పుయాదవ్ ఇంటి నుంచి పారిపోయి హజ్రత్ నిజాముద్దీన్ రైల్వేస్టేషనుకు వచ్చి హసీనాను కలిసింది. హసీనా బాలికకు మత్తు మందు ఇచ్చి ఓ గదిలోకి తీసుకువెళ్లగా మహమ్మద్ అఫ్రోజ్ అనే యువకుడు బాలికపై అత్యాచారం చేసి హసీనాకు డబ్బులిచ్చాడు.

స్పృహలోకి వచ్చిన బాలిక అక్కడినుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు ఇష్టమైన పనిని చేస్తున్న నాగచైతన్య, ఏంటది?

'పుష్ప-2' చిత్రం రిలీజ్ వాయిదానా?

'పుష్ప-2' ఎన్ని దేశాల్లో విడుదలవుతుందో తెలుసా?

విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత

థ్రిల్ కలిగించే UI ది మూవీ వార్నర్ రిలీజ్ : ఉపేంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments