Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ డాక్టర్.. తలకు గాయమైతే కాలికి ఆపరేషన్ చేశారు.. ఎక్కడ?

ఆ వైద్యులు తమ విధి నిర్వహణలో ఎంత ఖచ్చితత్వంతో పని చేస్తున్నారో వారు చేసిన ఆపరేషన్ తేటతెల్లం చేసింది. తలకు గాయమైతే కాలికి ఆపరేషన్ చేసి ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేశారు. అదీకూడా దేశ రాజధాని ఢిల్లీలో జ

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (11:14 IST)
ఆ వైద్యులు తమ విధి నిర్వహణలో ఎంత ఖచ్చితత్వంతో పని చేస్తున్నారో వారు చేసిన ఆపరేషన్ తేటతెల్లం చేసింది. తలకు గాయమైతే కాలికి ఆపరేషన్ చేసి ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేశారు. అదీకూడా దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తలకు గాయమైన విజయేంద్ర త్యాగి అనే వ్యక్తి చికిత్స చేయించుకునేందుకు ఢిల్లీలోని సుశ్రుత ట్రామా సెంటర్‌‌లో చేరాడు. అయితే అదే రోజు కాలు కాలు విరిగిన మరో వ్యక్తి అదే ఆస్పత్రిలో చేరాడు. వీరి పేర్ల విషయంలో అయోమయానికి గురైన డాక్టర్‌.. ఒకరికి చేయాల్సిన వైద్యం మరొకరి చేశాడు. కాలు విరిగిన వీరేంద్రకు అందించాల్సిన చికిత్సను విజయేంద్ర త్యాగికి అందించాడు. 
 
చికిత్సలో భాగంగా అతడి కాలికి రంధ్రం చేశాడు. మత్తులో ఉండటంతో అతడికి కూడా ఏమీ అర్థం కాలేదు. పేషంట్‌‌కు మెలకువ వచ్చిన అనంతరం అసలు విషయం తెలుసుకున్న వైద్యుడు ఖంగుతిన్నాడు. వెంటనే మళ్లీ తలకు సంబంధించిన చికిత్స చేసి తప్పించుకోవాలని చూశాడు. 
 
అయితే ఈ విషయాన్ని గమనించిన విజయేంద్ర త్యాగి కొడుకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ని‍ర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యునిపై చర్యలు తీసుకుంటామని సూపరిండెంటెండ్‌ అజయ్‌ భాల్‌ హామీ ఇచ్చారు. కాగా, ఇటీవల తరచూ కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు డయాలసిస్ చేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments