Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళపై వైద్యుడి అత్యాచారం.. వివస్త్రను చేసి, న్యూడ్ ఫోటోలు తీసి?

Webdunia
గురువారం, 17 అక్టోబరు 2019 (13:07 IST)
వైద్యవృత్తికే ఓ వైద్యుడు కళంకం తెచ్చాడు. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే.. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఆమె నగ్న ఫోటోలు తీసి ఐదు నెలలుగా ఆమెపై బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆస్పత్రికి వచ్చిన ఓ ఫార్మా కంపెనీ మహిళ (27) అతడి వద్దకు వచ్చి తమ కంపెనీ మందులను వివరించింది. 
 
అలా.. వారిద్దరు సన్నిహితులయ్యారు. ఆస్పత్రికి ఎప్పుడు వచ్చినా అతడ్ని కలిసి, కొత్తగా వచ్చిన ఔషధాల వివరాలు అందిస్తూ ఉండేది. ఈ క్రమంలో ఓ ప్రభుత్వ పరీక్ష కోసం అతడు సాయం చేస్తానని, అవసరమైన గైడెన్స్ ఇస్తానని చెప్పాడు. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులకు పాఠాలు చెబుతున్నానని నమ్మబలికాడు.

నిజమేనని నమ్మిన ఆ మహిళ.. తనకూ పాఠాలు చెప్పాలని కోరింది. దీనికోసం ఇంటి అడ్రెస్ కూడా చెప్పాడు. డాక్టర్‌ను నమ్మిన ఆ మహిళ మత్తు మందు కలిపిన డ్రింక్ ఆఫర్ చేశాడు. 
 
ఆ డ్రింక్ తాగిన మహిళ స్పృహ కోల్పోయింది. దీంతో ఆ డాక్టర్ ఆమెను బెడ్‌రూంకు తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను వివస్త్రను చేసి, న్యూడ్ ఫోటోలను తీసుకున్నాడు.

ఈ ఘటన గత మే లో జరిగింది. అయితే, అప్పటి నుంచి అతడు బాధితురాలి ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ తన కోరిక తీర్చుకున్నాడు. డాక్టర్ వేధింపులు ఎక్కువవడంతో భరించలేక గత శనివారం ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments