Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్ల్‌ఫ్రెండ్ ఖర్చుల కోసం దొంగగా మారిన గూగుల్ ఉద్యోగి.. పదివేలు?

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దొంగగా మారాడు. అదీ గర్ల్ ఫ్రెండ్ ఖర్చుల కోసం సంపాదించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

Webdunia
గురువారం, 11 అక్టోబరు 2018 (13:07 IST)
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దొంగగా మారాడు. అదీ గర్ల్ ఫ్రెండ్ ఖర్చుల కోసం సంపాదించేందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గర్విత్ షానీ అనే 24 ఏళ్ల ఇంజినీరు ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ గూగుల్‌లో పనిచేస్తున్నాడు. 
 
హర్యానాలోని అంబాలా జిల్లాకు చెందిన గర్విత్ షానీ సెప్టెంబర్ 11న ఢిల్లీలోని తాజ్‌ప్యాలెస్‌లో ఐబీఎం నిర్వహించిన ఓ సెమినార్‌లో పాల్గొన్నాడు. ఆ సమయంలో దేవయాని జైన్‌ అనే మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ.పదివేలు గల్లంతయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసిన పోలీసులు హోటల్‌ ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా, ఆహ్వానితుల జాబితా ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు క్యాబ్‌లో వచ్చినట్టు హోటల్‌ బయట ఏర్పాటైన కెమెరాల్లో రికార్డైంది. 
 
ఫోన్ ఆధారంగా పోలీసులు నిందితుడి అరెస్ట్ చేశారు. ఆర్థిక సమస్యల కారణంగా గర్ల్ ఫ్రెండ్ ఖర్చుల కోసం దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. చోరీ సొమ్ములో మూడువేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments