Webdunia - Bharat's app for daily news and videos

Install App

కశ్మీర్ విభజన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ షాకింగ్ ట్వీట్

Webdunia
మంగళవారం, 6 ఆగస్టు 2019 (06:29 IST)
జమ్మూ కశ్మీర్ ని విభజిస్తూ... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కాగా... ఆయన స్పందించిన తీరుని చూసి అందరూ షాకయ్యారు. ఇంతకీ మ్యాటరేంటంటే... జమ్మూకశ్మీర్ కి ఉన్న స్వయంప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం నేడు రద్దు చేసింది. జమ్మూ కశ్మీర్ ని రెండు భాగాలుగా విడదీసి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. 
 
కాగా... ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ తోపాటు మరికొన్ని పార్టీలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. కొన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. అయితే... బీజేపీ పేరు చెబితేనే మండిపడే కేజ్రీవాల్ ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించడం గమనార్హం.
 
బీజేపీకి వ్యతిరేంగా పోరాడుతూ.. ఢిల్లీలో అధికారం చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ తొలసారిగా ఆ పార్టీకి మద్దతు  పలికారు. జమ్మూ కశ్మీర్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

ఈ నిర్ణయంతో జమ్మూ కశ్మీర్ లో శాంతి నెలకొంటుందని.. అభివృద్ధి కూడా జరుగుతుందని తాము భావిస్తున్నట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా... కేజ్రీవాల్ ఇంత పాజిటివ్ గా ట్వీట్ చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments