Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పేలుళ్ళకు మా పనే : ఉగ్రసంస్థ జైష్ ఉల్ హింద్

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (16:16 IST)
ఢిల్లీలోని ఇజ్రాయెల్ దౌత్యకార్యాలయం వద్ద శుక్రవారం జరిగిన బాంబు పేలుళ్ళకు తామే కారణమంటూ ఉగ్రసంస్థ జైష్ ఉల్ హింద్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలాగే, జైష్‌కు చెందిన టెలిగ్రామ్‌ ఛానల్‌లో ఈ మేరకు ప్రకటన వెలువడినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) ప్రత్యేకంగా దృష్టిసారించింది. 
 
ఇదిలావుంటే, ఈ పేలుడు ఘటనపై ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఢిల్లీ ఎన్‌ఐఏ కేంద్ర కార్యాలయంలో అధికారులు నేడు కీలక సమావేశం నిర్వహించారు. ఘటనపై విస్తృతంగా చర్చించారు. పేలుడు ఘటన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థల క్రియాశీల సభ్యుల సమాచారం సేకరణకు ఎన్‌ఐఏ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 
 
అంతేగాక, స్లీపర్‌ సెల్స్‌ వివరాలు సేకరించాలని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే ఎన్ఐఏ బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించింది. ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తును జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌ పర్యవేక్షిస్తున్నారు. అయితే పేలుడు వెనుక ఎవరున్నారన్నది ఇంకా తెలియరాలేదని ప్రభుత్వం తెలిపింది.
 
దేశ రాజధాని నడిబొడ్డులో శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయానికి అత్యంత సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదే సమయంలో ఘటనాస్థలానికి 1.5 కిలోమీటర్ల దూరంలోని విజయ్‌ చౌక్‌లో గణతంత్ర వేడుకల ముగింపు కార్యక్రమం జరిగింది. అందులో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. అలాంటి అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో పేలుడు సంభవించడంతో దేశం ఉలిక్కిపడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

ట్రెండ్ కి తగ్గట్టుగా పండు చిరుమామిళ్ల ప్రేమికుడు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments