తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై మిస్టరీ వీడని నేపథ్యంలో... జయలలితకు ఓ కూతురున్నట్లు ఆమె మామ కుమార్తె లలిత ప్రకటన చేశారు. జయలలిత సోదరి వద్ద పెరిగిన అమృత సారథినే జయలలిత కుమార్తె అంటూ చెప్పారు. కానీ ఇ
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై మిస్టరీ వీడని నేపథ్యంలో... జయలలితకు ఓ కూతురున్నట్లు ఆమె మామ కుమార్తె లలిత ప్రకటన చేశారు. జయలలిత సోదరి వద్ద పెరిగిన అమృత సారథినే జయలలిత కుమార్తె అంటూ చెప్పారు. కానీ ఇది డీఎన్ఏ టెస్టు ద్వారానే నిర్ధారించగలమని లలిత చెప్పారు. ఇదే విధంగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా సంచలన కామెంట్లు చేశారు.
తన అత్తకు ఓ ఆడపిల్ల పుట్టిన మాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు. అయితే, ఆ బిడ్డ ఎక్కడ పెరిగింది? ఎవరు? ఇప్పుడెలా ఉంది? అనే విషయాలు తనకు తెలియవని చెప్పుకొచ్చారు. లలిత, దీప వ్యాఖ్యలతో అమ్మ వారసత్వంపై మరింత ఉత్కంఠ రేపాయి.
ఇప్పటికే తాను జయలలిత కుమార్తెనంటూ.. కావాలంటే డీఎన్ఏ టెస్టు ద్వారా తేల్చుకోవచ్చునని అమృత తెలిపింది. అమ్మ మృతదేహాన్ని వెలికి తీసి డీఎన్ఏ టెస్టు చేయించాలని.. ఆపై అమ్మ మృతదేహాన్ని బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. తాను జయలలిత బిడ్డనని, డీఎన్ఏ టెస్టు చేయించాలని రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి లేఖ రాశానని అయితే ఇంతవరకు ఎవ్వరూ స్పందించలేదని చెప్పుకొచ్చింది.