Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆర్కే నగర్ ఎన్నికలు: అన్నాడీఎంకేలో లుకలుకలు.. అమృతకు డీఎన్‌ఏ పరీక్ష చేస్తారా?

ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఏకమైనా.. రెండాకుల చిహ్నాన్ని ఎలక్షన్ కమీషన్ వారికే ఇచ్చినా.. ఆర్కే నగర్ ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థి పట్ల ఏకాభిప్రాయం కుదరలేదు. మళ్లీ ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. అమ్మ మరణ

Advertiesment
ఆర్కే నగర్ ఎన్నికలు: అన్నాడీఎంకేలో లుకలుకలు.. అమృతకు డీఎన్‌ఏ పరీక్ష చేస్తారా?
, మంగళవారం, 28 నవంబరు 2017 (11:23 IST)
ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఏకమైనా.. రెండాకుల చిహ్నాన్ని ఎలక్షన్ కమీషన్ వారికే ఇచ్చినా.. ఆర్కే నగర్ ఎన్నికల బరిలో నిలబడే అభ్యర్థి పట్ల ఏకాభిప్రాయం కుదరలేదు. మళ్లీ ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. అమ్మ మరణానికి అనంతరం తమిళనాట పెద్ద డ్రామానే జరిగింది. 
 
చిన్నమ్మ అధికారంలోకి రావడం.. ఓపీఎస్ రెబల్‌గా మారడం.. ఆపై శశికళ జైలుకెళ్లడం.. తిరిగి ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు ఏకం కావడం వంటివి జరిగిపోయాయి. అయితే తాజాగా ఆర్కే నగర్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. అన్నాడీఎంకే అభ్యర్థిని నిలబెట్టే విషయంలో ఓపీఎస్, ఈపీఎస్ వర్గాలు పోటీపడుతున్నాయి. ఫలితంగా అన్నాడీఎంకే పార్టీలో తిరిగి లుకలుకలు ప్రారంభమైనాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 
 
ఆర్కే ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థి ఎంపిక విషయంలో సోమవారం అన్నాడీఎంకే కార్యనిర్వాహక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పళని వర్గం, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ వర్గీయుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. మధుసూదన్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసే విషయంలో పన్నీర్ వర్గం రెండుగా చీలిపోయింది. ఓ వర్గం ఆయనకు మద్దతు ప్రకటించగా, మరో వర్గం వ్యతిరేకించింది. 
 
పళనిస్వామి వర్గం గోకుల ఇందిరను తెరపైకి తీసుకొచ్చింది. ఈ సమావేశానికి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ హాజరయ్యారు. మునుస్వామి తనకే సీటు కావాలని పట్టుబట్టారు. మధుసూదన్ మౌనం వహించి.. యువతకు అవకాశం ఇచ్చే క్రమంలో గోకుల ఇందిర పేరును ప్రతిపాదించారు. ఈ క్రమంలో, సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో, అభ్యర్థి ఎంపికను ఈనెల 29కి వాయిదా వేశారు.  
 
మరోవైపు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసుల చిచ్చు వీడేట్లులేదు. తాజాగా అమ్మ వారసురాలిగా అమృత అనే మరో మహిళ తెరపైకి వచ్చింది. బెంగళూరుకు చెందిన అమృత సారధి జయకు తానే అసలైన వారసురాలినని జయలలిత తన కన్న తల్లేనని అంటోంది. కావాలంటే డిఎన్ఏ టెస్టు చేయాలంటూ ఏకంగా సుప్రీం కోర్టుకే ఎక్కింది. కానీ కర్ణాటక హైకోర్టులో ఈ వివాదంపై తేల్చుకోవాలని సుప్రీం సూచించింది. జయలలిత తన కన్న తల్లి అనీ తాను బెంగళూరులోని జయ లలిత సోదరి శైలజ, ఆమె భర్త దగ్గర పెరిగాననీ చెబుతోంది.
 
1980 ఆగస్టు14న తాను పుట్టానని జయకు రాజకీయపరమైన ఇబ్బందులు రాకూడదనే తన పుట్టుకను బహిరంగ పరచలేదన్నారు. అయితే తన తండ్రి ఎవరనే అంశాన్ని మాత్రం ఆమె వెల్లడించట్లేదు. తమ కుటుంబం సనాతన సంప్రదాయాలకు విలువనిచ్చే బ్రాహ్మణ కుటుంబం కావడంతో తన పుట్టుకను గోప్యంగా ఉంచారంటోంది. అయితే అమృత వాదనలను సమర్ధిస్తూ ఆమె పినతల్లులు కూడా కోర్టుకొచ్చారు అమతకు డిఎన్ఏ  టెస్టు చేయాలని వారు కూడా కోరుతున్నారు. 
 
జయ మరణంతో ఒక్కసారిగా తెరపైకి వచ్చిన వారసత్వ పోరు రోజుకో కొత్త టర్న్ తీసుకుంటోంది. అయితే అమృత ఆరోపణలను దీపా జయకుమార్ గతంలోనే కొట్టి పారేసింది. మరి ఈ వివాదానికి ఎప్పుడు తెరపడుతుందో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిత్తిరి సత్తిపై దాడి ఎందుకంటే?: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్