ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తానంటున్న శశికళ మేనల్లుడు
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన చెన్నై ఆర్కే నగర్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ప్రకటిం
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన చెన్నై ఆర్కే నగర్ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ప్రకటించారు.
జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆమె చనిపోయిన తర్వాత ఆర్కేనగర్‌లో ఉప ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అక్కడ ఓట్ల కోసం నగదు చెల్లించినట్లు చివరి నిమిషంలో తేలడంతో ఉప ఎన్నికను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఈనేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో సాధారణ ఎన్నికల గడువు వివరాలు ప్రకటించే సమయంలోనే ఎన్నికల సంఘం ఆర్కే నగర్ ఉపఎన్నికల విషయాన్ని కూడా ప్రస్తావించింది. ఈ యేడాది ఆఖర్లో బైపోల్ నిర్వహించనున్నట్టు తెలిపింది.
ఈనేపథ్యంలో దినకరన్ కూడా పోటీ చేస్తానని అంటున్నారు. అయితే, పార్టీ తరపు నుంచి ఎవరు పోటీ చేయాలన్నది పార్టీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ నిర్ణయిస్తారని ఆయన తెలిపారు. మరోపక్క ఆర్కే నగర్ నుంచి పోటీ చేయడానికి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు.