Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

3,500 అడుగుల ఎత్తైన కొండపై గుడి.. ప్రదక్షిణలు చేస్తూ లోయలో పడిన?

తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో 3,500 అడుగుల ఎత్తైన కొండ శిఖరంపై ఉన్న ఓ ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. తిరుచ్చి తలమాలై కొండలపై సంజీవి పెరుమాళ్ ఆలయం వుంది. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలపై నిషేధం అమలులో ఉంది. ఈ

Advertiesment
3,500 అడుగుల ఎత్తైన కొండపై గుడి.. ప్రదక్షిణలు చేస్తూ లోయలో పడిన?
, సోమవారం, 16 అక్టోబరు 2017 (12:11 IST)
తమిళనాడులోని తిరుచ్చి జిల్లాలో 3,500 అడుగుల ఎత్తైన కొండ శిఖరంపై ఉన్న ఓ ఆలయంలో విషాదం చోటుచేసుకుంది. తిరుచ్చి తలమాలై కొండలపై సంజీవి పెరుమాళ్ ఆలయం వుంది. ఈ ఆలయం చుట్టూ ప్రదక్షిణలపై నిషేధం అమలులో ఉంది. ఈ నేపథ్యంలో నిబంధనలను మీరి, గుడి చుట్టూ తిరగాలని చూసిన ఓ యువకుడు కాలు జారి లోయలో పడి మృతి చెందాడు. ఆ దృశ్యాలు వీడియోలో రికార్డైనాయి. 
 
ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ఆలయం చుట్టూ ప్రదక్షణ కోసం వచ్చి.. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి పేరు యువకుడి పేరు ఆర్ముగం అని చెప్పారు. ఆర్ముగం ప్రదక్షిణ ప్రారంభించిన వేళ, పక్కన ఉన్న కొందరు అతన్ని వీడియో తీశారని.. అతని కాలు అదుపు తప్పిందని ఆర్ముగం తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వారు తెలిపారు. వీడియో తీస్తున్నవారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు. 
 
ఈ గుడి చుట్టూ తిరగడానికి అనుమతి లేదని.. రోజూ పదుల సంఖ్యలో భక్తులు వచ్చే దేవాలయానికి, ప్రస్తుతం తమిళ పురట్టాసి మాసం కావడంతో భక్తుల సంఖ్య పెరిగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మీరు ఇంటర్వ్యూ చేస్తున్నది మాజీ రాష్ట్రపతి'ని.. రాజ్‌దీప్‌కు ప్రణబ్ వార్నింగ్ (వీడియో వైరల్)