Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇడుక్కి ఘటన.. 54కి చేరిన మృతుల సంఖ్య.. 16మంది గల్లంతు

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (15:35 IST)
Edukki
కేరళ రాష్ట్రంలో ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వుంది. ఈ ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 54కి చేరింది. ఈ ప్రమాదం అనంతరం గల్లంతైన వారిలో మరో 16మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ నెల 8న ఇడుక్కి జిల్లాలోని రాజమల ఏరియాలో కొండచరియలు విరిగిపడటంతో పలువురు ఆ శిథిలాల కింద చిక్కుకున్నారు. 
 
అప్పటి నుంచి అక్కడ ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నా కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. తాజాగా బుధవారం మరో రెండు మృతదేహాలను వెలికి తీయడంతో ఆ ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య 54కు చేరింది.
 
ఇదిలా ఉండగా మృతుల బంధువులకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేసి, జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయా ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments