తప్పిపోయిన కోడలు ఇంటికి రావాలనీ... నాలుక కోసుకున్న అత్త.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (16:52 IST)
సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ గ్రామాల్లో మాత్రం మూఢనమ్మకాలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఫలితంగా అనేక మంది మహిళలు తమ కోర్కెలు తీర్చుకునేందుకు వివిధ రకాలుగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిలో ఓ మహిళ.. ఇంటి నుంచి తప్పిపోయిన తమ కోడలు సురక్షితంగా ఇటికి రావాలని కోరుకుంటూ తన నాలుకను కోసుకుంది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో సెరైకెలా - ఖర్సావన్ జిల్లాలోని ఎన్‌ఐటీ క్యాంపస్‌లో ఆదివారం జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎన్‌ఐటీ క్యాంపస్‌లో ఎన్‌ఐటీ క్యాంపస్‌కు చెందిన లక్ష్మీ నిరాలా అనే మహిళ కోడలైన జ్యోతి ఈ నెల 14వ తేదీన తన బిడ్డతో కలిసి తప్పిపోయింది. అప్పటి నుంచి శివుడి గుడి ముందు కూర్చొని లక్ష్మీ పూజలు చేస్తూ ప్రార్థించసాగింది. 
 
తన కోడలు, మనువడు సురక్షితం ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ తన నాలుకను కత్తిరించి, శివుడికి నైవేద్యంగా సమర్పించింది. ఇలా చేస్తే కోడలు తిరిగి వస్తుందని ఎవరో చెప్పుడంతో లక్ష్మీ అలా చేసింది. ఈ విషయాన్ని ఆమె భర్త నందూలాల్‌ నిరాల వెల్లడించారు. 
 
నాలుక కత్తిరించుకున్న అనంతరం రక్తస్రావం అవుతున్నప్పటికీ ఆమె ఆస్పత్రికి వెళ్లడానికి నిరాకరించారు. ఇరుగుపొరుగు వాళ్లు నచ్చజెప్పి ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, నాలుక పూర్తిగా తెగడంతో మాట్లాడలేకపోతున్నారని వైద్యులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ పాత్ర కోసం సంప్రదించి.. రూ.3 కోట్లు ఆఫర్ చేశారు : మల్లారెడ్డి

Avika Gor: మిలింద్ తో పెండ్లి సమయంలో అవికా గోర్ కన్నీళ్ళుపెట్టుకుంది

Vijay Deverakonda: అందుకే సత్యసాయి బాబా మహా సమాధిని విజయ్ దేవరకొండ సందర్శించారా

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments