Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

ఠాగూర్
సోమవారం, 17 ఫిబ్రవరి 2025 (14:03 IST)
బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. ఈ కారణంగా తుఫాను ముప్పు తప్పదని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. పైగా, తుఫాను ప్రభావంతో తెలంగాణాతో పాటు అనేక రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉందని పేర్కొంది. ప్రధానంగా ఈశాన్య భారత రాష్ట్రాలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది. ఫిబ్రవరి 19వ తేదీన ఈశాన్య భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులుపడే అవకాశం ఉందని వెల్లడించింది. అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో ఈ నెల 19వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 
 
అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సబ్ హిమాలయన్, వెస్ట్ బెంగాల్, సిక్కింలలో రానున్న వారం రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంఖండ్‌లోని ఫిబ్రవరి 19, 20వ తేదీల్లో హిమపాతం కారణంగా దట్టంగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ లోపు రాజస్థాన్‌, పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్‌ పశ్చిమ ప్రాంతాల్లో ఫిబ్రవరి 19, 20వ  తేదీన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెట్స్ సెల్యూట్ ద ఇండియన్ ఆర్మీ - ఈ ఏడాది వెరీ మెమరబుల్ ఇయర్ : నాని

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments