Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతి తీవ్ర తుఫానుగా "నివర్" .. తమిళనాడులో కుండపోత వర్షం

Webdunia
బుధవారం, 25 నవంబరు 2020 (09:09 IST)
ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన నివర్ తుఫాను ఇపుడు అతి తీవ్రరూపం దాల్చింది. గత 6 గంటలుగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా పయనిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులోని కడలూరుకు తూర్పు ఆగ్నేయ దిశగా 310 కిమీ దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 320 కిమీ దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 380 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. అయితే, ఈ తుఫాను బుధవారం రాత్రి 8 - 9 గంటల మధ్యలో తీరందాటొచ్చని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
కాగా, ఈ నివర్ తుఫాను కారణంగా తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర విభాగాలకు మినహా తమిళనాడులో నేడు సెలవు ప్రకటించారు. 7 జిల్లాల్లో ప్రజా రవాణా నిలిపివేశారు. కాగా, ఈ అతి తీవ్ర తుఫాను కారైక్కాల్, మామల్లపురం (మహాబలిపురం) మధ్య తీరం దాటుతుందని, తీరం దాటే సమయంలో కడలూరు, విళుపురం, కల్లకురిచ్చి జిల్లాల్లోనూ, పుదుచ్చేరిలోనూ మూడ్రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
 
అలాగే, గంటకు 145 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ఇక నివర్ కారణంగా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనే కాకుండా తెలంగాణలోనూ భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు తెలిపారు. బుధవారం నుంచి 27వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వివరించారు. దీంతో నెల్లూరు జిల్లాతో పాటు.. కృష్ణపట్నం ఓడరేవులో కూడా ప్రమాదం హెచ్చరికలు జారీచేశారు. జాలర్లు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని జిల్లా యంత్రాంగం కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments