Webdunia - Bharat's app for daily news and videos

Install App

దానా తుఫాను - అక్కడ తీరం దాటే ఛాన్స్... 200కుపైగా రైళ్లు రద్దు...

ఠాగూర్
గురువారం, 24 అక్టోబరు 2024 (10:44 IST)
బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాను గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం మధ్యలో ఒరిస్సా రాష్ట్రంలోని భీతరకణికా నేషనల్ పార్కు, ధామ్రా పోర్టు మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అచనా వేసింది. తుఫాను తీరం దాటే సమయంలో సముద్రంలో అలలు 2 మీటర్ల మేరకు ఎగిసిపడతాయని, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అందువల్ల జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని, తీరప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించింది. దీంతో ఒరిస్సా ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ఒరిస్సాలోని 14 జిల్లాల్లో 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. ఇప్పటికే 6 వేల సహాయక శిబిరాలను అధికారులు సిద్ధం చేశారు. పాలు, ఆహారం, వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి దానా తుఫాను ఒరిస్సా తీరానికి 70 కిలోమీటర్ల  దూరంలో ఉన్నట్టు ఐఎండీ అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల వల్ల కేంద్ర పౌర, భద్రక్, బాలాసోర్ జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని తెలిపింది. 
 
'అక్టోబరు 24న అన్ని కోస్తా జిల్లాల్లో గాలుల వేగం అత్యధికంగా 100 నుండి 120 కి.మీ/గం ఉంటుంది, అయితే చాలా తీర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మొదలవుతాయి. కాలక్రమేణా, తీవ్రమైన తుఫాను తుఫాను చాలా ఎక్కువ వర్షపాతం పైకి తెస్తుంది. 20 సెం.మీ. ఇది ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు వర్తిస్తుంది, ఇక్కడ భారీ వర్షాల కారణంగా, అక్టోబరు 25న ఒక నుండి రెండు మీటర్ల అలలు కూడా పెద్ద ప్రాంతాలను ముంచెత్తుతాయి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో పాటు నిలబడి ఉన్న పంటలు, గడ్డి మరియు టిన్ ఇళ్ళు, విద్యుత్ మరియు టెలిఫోన్ స్తంభాలకు భారీ నష్టం మరియు విధ్వంసం సంభవించే అవకాశం ఉంది' అని ఐఎండీ డీజీ మృత్యుంజయ మహాపాత్ర వెల్లడించారు. 
 
ఇదిలావుంటే, దానా తుఫాను నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈస్ట్రన్ రైల్వే షీల్డా డివిజన్‌లో గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు ఏకంగా 190 లోకల్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. మరోవైరు, దక్షిణ మధ్య రైల్వే 14 రైళ్లను రద్దుచేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్టు తెలిపింది. ఈ నెల 24, 25, 26, 27 తేదీల్లో అనేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తుఫాను నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య కేంద్రాల్లో రైళ్ల రాకపోకల సమాచారం కోసం 17 నగరాలు, పట్టణాల్లో హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. కాగా, తుఫాను ఎఫెక్టు కారణంగా ఇప్పటివరకు దాదాపు 200 రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వు స్టార్ అవుతావురా చెక్ తీసుకో అంటే మాటరాలేదు: విజయ్ దేవరకొండ

37 రోజుల్లో నరకం అనుభవించాం.. ఎంతో కోల్పోయాను : జానీ మాస్టర్

పట్టలేని ఆనందంలో రేణూ దేశాయ్ .. ఎందుకో తెలుసా?

సాయి దుర్గా తేజ్ 18వ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ స్వరకర్తగా ఎంట్రీ

సారంగపాణిలో ప్రణయ గీతంలో అలరిస్తున్న ప్రియదర్శి, రూపా కొడువాయుర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ సమయాల్లో మంచినీరు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?

అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ఇన్‌స్టంట్ నూడుల్స్ తినేవారు తప్పక తెలుసుకోవాల్సినవి

డోజీ సంచలనాత్మక అధ్యయనం: ఏఐ-ఆధారిత ముందస్తు హెచ్చరిక వ్యవస్థ రోగి ఆరోగ్య పరిస్థితి అంచనా

దాల్చిన చెక్కలో దాగున్న ఆరోగ్య రహస్యాలు

తర్వాతి కథనం
Show comments