Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజిటల్ ఇండియా... డిజిటల్ ఇండియా అన్నారు... ఇప్పుడేమైంది... గుజరాత్ గుల్లవుతోంది...

డిజిటల్ ఇండియా అంటూ అన్నీ నెట్లో పెట్టేసి నోట్లో వేలేసుకుని క్లిక్ కొడితే చాలు అన్నీ మన కళ్లముందే అని దర్జాగా కూర్చుంటే ఏమవుతుందో చూపిస్తున్నారు హాకర్లు. ప్రపంచాన్ని ఓ మోస్తరు లెవల్లో గడగడలాడిస్తున్న

Webdunia
మంగళవారం, 16 మే 2017 (20:19 IST)
డిజిటల్ ఇండియా అంటూ అన్నీ నెట్లో పెట్టేసి నోట్లో వేలేసుకుని పడక కుర్చీలో కూర్చుని కంప్యూటర్లో చటుక్కున ఓ క్లిక్ కొడితే చాలు అన్నీ మన కళ్లముందే అని దర్జాగా కూర్చుంటే ఏమవుతుందో చూపిస్తున్నారు హాకర్లు. ప్రపంచాన్ని ఓ మోస్తరు లెవల్లో గడగడలాడిస్తున్న హాకర్లు తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే వున్నట్లు వరుస హ్యాకింగ్ ఉదంతాలు బయటకు తెలుపుతున్నాయి. ఈ హాకింగ్ దెబ్బకు మన దేశంలో భారీగా దెబ్బతిన్నది గుజరాత్ ప్రభుత్వ పరిపాలనా విభాగం అంటున్నారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుతో అంతా డిజిటల్ మయంగా మారుతోంది. గుజరాత్ ఈ విషయంలో చాలా ముందుకు వెళ్లిపోయింది. ఐతే తాజాగా రాన్సమ్వేర్ సైబర్ ఎటాక్ దెబ్బకు గుజరాత్ ప్రభుత్వంలోని పలు విభాగాల్లోని కంప్యూటర్లు పనిచేయడంలేదు. సైబర్ ఎటాక్ కారణంగా ఆయా విభాగాల్లోని కంప్యూటర్లను క్రాష్ చేసేస్తున్నారు. అంతేకాదు... ముందుజాగ్రత్తచర్యగా కంప్యూటర్లను స్విచాఫ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
రాష్ట్ర ఐటీ కార్యదర్శి ఓ ప్రకటనలో తెలుపుతూ... రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 120 కంప్యూటర్లకు వైరస్ అటాక్ అయిందని అన్నారు. అంతేకాదు... అన్ని డిపార్టుమెంట్లకు సెక్యూరిటీతో కూడిన ప్యాచ్‌లను ఇన్‌స్టాల్ చేసి అప్‌గ్రేడ్ చేయాల్సిందిగా సూచన చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటయా అంటే... ఏ ప్రైవేట్ కంపెనీకి చెందిన కంప్యూటర్లు సైబర్ అటాక్ కు గురికాకపోవడం. అంటే... ప్రభుత్వరంగ డిజిటలైజేషన్ ఎంత అధ్వాన్నంగా వుందో అర్థమవడంలేదూ....?!!
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇప్పుడు నా చేతులు వణకడం లేదు.. మైక్ పట్టుకోగలుగుతున్నా : హీరో విశాల్ (Video)

ఎపుడు కోలుకుంటానో భగవంతుడికే తెలియాలి : రష్మిక మందన్నా

హీరో విశాల్ త్వరగా కోలుకోవాలి : హీరోయిన్ వరలక్ష్మి!!

బాలక్రిష్ణ డాకు మహారాజ్ సంక్రాంతి సందడి చేస్తుందా? డాకు మహారాజ్ రివ్యూ

మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఆరోగ్యంగా ఉన్నాను : హీరో విశాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments