Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భవతుల కడుపులో బంగారం... కిడ్నాప్ చేసి కొట్టేశారు...

Webdunia
గురువారం, 7 నవంబరు 2019 (18:19 IST)
ఆ ఇద్దరు మహిళలు గర్భందాల్చివున్నారు. వీరిద్దరూ శ్రీలంక నుంచి చెన్నైకు విమానంలో వచ్చారు. విమానం దిగిన తర్వాత తిన్నగా నడుచుకుంటూ బయటకు వచ్చారు. అయితే, కస్టమ్స్ అధికారులకు ఎక్కడో చిన్న సందేహం కలిగింది. ఆ ఇద్దరు గర్భవతుల తీరుపై అనుమానం కలిగింది. అంతే.. వారిద్దరినీ ఆపి తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. వారిద్దరూ నిజమైన గర్భవతులు కాదనీ, వారి కడుపులో బంగారం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వారిని కారులో ఆస్పత్రికి తరలించి బంగారాన్ని వెలికి తీయాలని ప్లాన్ చేశారు. 
 
అయితే, ఈ విషయం కిడ్నాపర్లకు తెలిసింది. అంతే... ఈ మహిళలు, కస్టమ్స్ అధికారులు ప్రయాణిస్తున్న కారును పది మంది దుండగులు అడ్డుకున్నారు. ఇద్దరు మహిళలను మెరుపు వేగంతో కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి ఎనిమా చికిత్స ద్వారా బంగారం వెలికి తీసి వదిలివేశారు. ఈ ఘటనతో కస్టమ్స్ అధికారులు అవాక్కయ్యారు. అంతా సినీ ఫక్కీలో క్షణాల్లో జరిగిపోయింది. 
 
మంగళవారం శ్రీలంక నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఓ విమానం వచ్చింది. అందులో వచ్చిన విమాన ప్రయాణికులను కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. వీరిలో గర్భం దాల్చినట్టు ఉన్న శ్రీలంకకు చెందిన ఫాతిమా(32), త్రిష(36)ల తీరు అనుమానాస్పదంగా కనిపించింది. వారిద్దరి కడుపులో బంగారపు ముద్దలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఎనిమా ద్వారా బయటకు తీయించేందుకు ఆస్పత్రికి కారులో బయల్దేరారు.
 
దారిలో 10 మంది దుండ గులు మహిళలను కిడ్నాప్‌ చేసి చెంగల్పట్టులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారికి ఎనిమా చేయించి కడుపులో ఉన్న బంగారాన్ని తీసుకున్నారు. అనంతరం ఆ మహిళలను మీనంబాక్కం సమీపంలో విడిచిపెట్టగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి కిడ్నాప్‌ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments