18 ఏళ్లు నిండిన వారికి 24 నుంచే వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్‌

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:49 IST)
దేశంలో 18 ఏళ్లు నిండిన అంద‌రికీ మే 1వ తేదీ నుంచి క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని కేంద్రం నిర్ణ‌యించిన సంగ‌తి తెల్సిందే. దీనికి సంబంధించి ఈ నెల 24 నుంచి రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంద‌ని నేష‌న‌ల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శ‌ర్మ గురువారం వెల్ల‌డించారు. 
 
CoWin యాప్ ద్వారానే రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని చెప్పారు. ఆ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన అంద‌రూ రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌, అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు గ‌తంలోలాగానే ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. 
 
వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయ‌డానికి మ‌రిన్ని ప్ర‌భుత్వ కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని, ప్రైవేటు ఆసుప‌త్రుల సంఖ్య కూడా పెరిగింద‌ని చెప్పారు. కాగా, ప్రస్తుతం 45 యేళ్లు నిండినవారికి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments