సుప్రీంకోర్టును కుదిపేస్తున్న కరోనా.. 15 మంది జడ్జీలకు పాజిటివ్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (15:45 IST)
సుప్రీంకోర్టులో 15 మంది న్యాయమూర్తులకు కరోనా సోకినట్లు తేలింది. అందులో ఒకరు చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. తమ సిబ్బందికి కరోనా వచ్చిందని ముగ్గురు న్యాయమూర్తులు వెల్లడించారు. కరోనా రెండో దశ వ్యాప్తి సుప్రీంకోర్టును కుదిపేస్తోంది. ఇప్పటికే వైరస్ ప్రభావం కేసుల విచారణపై పడింది. 
 
తాజాగా.. సుప్రీంకోర్టులో 15 మంది న్యాయమూర్తులకు కరోనా సోకినట్లు తేలింది. అందులో ఒకరు ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. అదేసమయంలో, తమ సిబ్బందికి కరోనా సోకిందని.. న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ సూర్యకాంత్​లు వెల్లడించారు. 
 
పరిమిత కేసులు.. వర్చువల్ వాదనలు
తొలి దశలో కరోనా వ్యాప్తి సందర్భంగా సుప్రీంలో ఎటువంటి పరిస్థితి ఉండేదో.. ప్రస్తుతం అదే విధంగా ఉందని అధికారులు చెబుతున్నారు. న్యాయమూర్తులు తమ స్వస్థలాల నుంచే వర్చువల్​గా వాదనలు వింటున్నారు. ఇప్పుడు.. 11 న్యాయమూర్తులతో కూడిన నాలుగు బెంచీలు వాదనలు ఆలకిస్తున్నాయి. పరిమితమైన కేసులను మాత్రమే విచారిస్తున్నారు.
 
సుప్రీంలోని న్యాయమూర్తులందరికీ నెల క్రితమే వ్యాక్సిన్ అందించారు. న్యాయవాదులు, సిబ్బందికి టీకా ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లక్షణాలు ఉన్నవారికి ఆర్​టీ - పీసీఆర్ పరీక్షలు తప్పనిసరి చేసింది న్యాయస్థానం. కరోనా​ లక్షణాలు కనిపిస్తే కోర్టుకు రావొద్దని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments