Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైనా ప్రేమించిన అమ్మాయితో ఉండొచ్చు: హైకోర్టు సంచలన తీర్పు

Webdunia
మంగళవారం, 26 మార్చి 2019 (15:27 IST)
వివాహం చేసుకుని భార్య ఉన్న కూడా మరొక మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధమని చట్టం చెబుతుంది. అయితే పెళ్లైన వ్యక్తిని ప్రేమించిన యువతిని అతనితో కలిసి ఉండవచ్చు అంటూ రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఓ కేసు విచారణలో భాగంగా రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులు సందీప్‌ మెహతా, వినిత్‌ కుమార్‌ మథూర్‌‌లు ఈ మేరకు సంచలన తీర్పునిచ్చారు.
 
మొయినుద్దీన్ అనే వ్యక్తికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పాల్ సోనీ అనే 26 ఏళ్ల యువతి అతడిని ప్రేమించింది. భార్యాపిల్లలు ఉన్న ఏ వ్యక్తితోనూ పెళ్లి చేయడానికి ఏ యువతి తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఈ క్రమంలో వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో మొయినుద్దీన్ మరియు సోనీలు ఇంటర్ ఫెయిత్ (నమ్మకం) వివాహం చేసుకున్నారు. అలాగే ఆ పెళ్లిని రిజిస్టర్ చేయించుకున్నారు.
 
ఇది తెలుసుకున్న సోనీ తల్లిదండ్రులు ఆమెను హౌస్ అరెస్ట్ చేసారు. దీంతో మొయినుద్దీన్ ఆమె కోసం కోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేసాడు. పోలీసులు సోనీని మార్చి 13వ తేదీన కోర్టు ముందు హాజరుపరిచారు. కేసును క్షుణ్ణంగా విచారించిన తర్వాత ఆమె భవిష్యత్తు, తదనంతర పరిణామాలను గురించి సోనీకి కౌన్సిలింగ్‌ని ఇప్పించినప్పటికీ, ఆమె మొయినుద్దీన్‌తోనే ఉంటానని తేల్చి చెప్పింది. 
 
సోనీ మేజర్ కావడంతో ఆమెను మానసిక పరిపక్వత గల యువతిగా భావించిన న్యాయమూర్తులు సోనీ- మొయినుద్దీన్ కలిసి ఉండేలా సంచలన తీర్పునిచ్చారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments