Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొన్ని గంటల్లో మూహూర్తం.. ఇంటి పైకప్పు కూలి వధువు గాయాలు.. అయినా పెళ్లి...

Webdunia
శుక్రవారం, 18 డిశెంబరు 2020 (13:31 IST)
మరికొన్ని గంటల్లో ఆ వధువు మెడలో మూడు ముళ్లుపడాల్సివుంది. ఇంతలో వధువు ఇంట విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ ప్రమాదంలో వధువు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం వరుడుకు తెలిసింది. అయినప్పటికీ.. అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలని పెద్దలను కోరాడు. వారంతా సమ్మతించడంతో ముందుగా నిర్ణయించిన సమయానికి పెళ్లి జరిగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొన్ని గంటల్లో వివాహం జరగాల్సి ఉండగా.. పెళ్లి కూతురి ఇంటి పైకప్పు కూలడంతో వధువు తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమె వెన్నెముక, కాళ్లకు గాయాలయ్యాయి. దీంతో వధువు ఆర్తిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు.
 
అయినప్పటికీ, పెద్ద మనసున్న పెళ్లి కొడుకు ఆర్తిని అనుకున్న ముహూర్తానికే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. దీంతో ఆర్తి గాయాలతో మంచంపై ఉన్నప్పటికీ పెద్దలు పెళ్లి చేశారు. ఆసుపత్రి వైద్యులు కూడా వారి పెళ్లికి అభ్యంతరాలు చెప్పలేదు. పెళ్లికొడుకు అవధేశ్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ప్రశంసించారు. 
 
ఇటువంటి కష్ట సమయంలో పెళ్లి కూతురికి తాను మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని అవధేశ్ అన్నాడు. ఈ పరిస్థితి వచ్చినందుకు తాను భయపడ్డానని పెళ్లి కూతురు ఆర్తి చెప్పింది. అయితే, వరుడు తనకు అండగా నిలిచాడని, తాను గాయాలపాలైనా పెళ్లి చేసుకున్నాడని ఆర్తి తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments