Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండుసార్లు పెళ్లిచేసుకున్నారు.. అయితే భర్తకు షాక్ ఇచ్చింది.. ఎలా?

ఓ యువతి ఏడాది వ్యవధిలోనే ఒకే వ్యక్తిని రెండుసార్లు పెళ్లి చేసుకుంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... అహ్మదాబాద్‌కు చెందిన 26ఏళ్ల యువతి ఫార్మసిస్టుగా పనిచేస్తోంది. మరో ఫార్మసిస్ట

Webdunia
ఆదివారం, 8 అక్టోబరు 2017 (16:39 IST)
ఓ యువతి  ఏడాది వ్యవధిలోనే ఒకే వ్యక్తిని రెండుసార్లు పెళ్లి చేసుకుంది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... అహ్మదాబాద్‌కు చెందిన 26ఏళ్ల యువతి ఫార్మసిస్టుగా పనిచేస్తోంది. మరో ఫార్మసిస్టు, చిన్నతనం నుంచి కలసి చదువుకున్న వ్యక్తిని నవంబర్ 2016లో పెళ్లి చేసుకుంది.

వీరి వివాహం దారయపూర్‌లో రిజిస్టర్ అయ్యింది. అయితే తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు ఆ వ్యక్తికి ఈ ఏడాది జూన్‌లో భర్తకు విడాకులు ఇచ్చింది. అయితే, ఈ దంపతులు తల్లిదండ్రుల ఒత్తిడి లెక్కచేయకుండా వారిని ఎదిరించి.. తిరిగి ఆగస్టులో మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఆగస్టు 14న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
 
ఈ దఫా మాత్రం మహిళ తండ్రి ఆ జంట వద్దకు వచ్చి పెళ్లికి అంగీకరించామని, ఇంటికి రావాలని కోరాడు. సెప్టెంబర్ 21న వారింటికి తీసుకెళ్లాడు. అక్కడ  కోపాన్ని చూపించి.. మళ్లీ విడాకులు తీసుకోమన్నాడు. అల్లుడు వినకపోవడంతో గదిలో పెట్టి తాళం వేసి, కుమార్తెను తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. 
 
స్థానికుల సాయంతో బయటపడ్డ అతను, 28వ తేదీన హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. అయితే కోర్టులో భర్తకు ఆమె షాకిచ్చింది. తల్లిదండ్రులతోనే ఉంటానని భర్త తనను సరిగ్గా చూసుకోలేదని చెప్పింది. దీంతో కేసు విచారణను న్యాయమూర్తి వాయిదా వేయగా, తల్లిదండ్రులు బెదిరించి తన భార్యతో ఇలా చెప్పించారని భర్త వాపోయాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments