Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారు కరోనా బారిన పడినా ఆన్ డ్యూటీ కిందే లెక్క

Webdunia
గురువారం, 13 ఆగస్టు 2020 (08:21 IST)
కరోనా బాధితుల కోసం రేయింబవళ్లు శ్రమిస్తూ అదే రోగం బారిన పడుతున్న వైద్య సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది.

కోవిడ్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో వైరస్ బారిన పడిన వైద్యులు, వైద్య సిబ్బంది క్వారంటైన్ కాలాన్ని ఆన్ డ్యూటీ పరిగణించాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వైరస్ సోకిన వైద్యులు, వైద్య సిబ్బంది క్వారంటైన్ కాలాన్ని ప్రాథమికంగా ఒక వారానికి కుదిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
వారం తర్వాత ఆ ఉద్యోగి ఆరోగ్యపరిస్థితిని ఉన్నతాధికారుల సమీక్షించి క్వారంటైన్ కాలాన్ని పొడిగించే విషయంలో నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

అయితే క్వారంటైన్ అయినా, పొడిగించినా ఆ కాలాన్ని ఆన్ డ్యూటీ గానే భావించాలి అన్ని రాష్ట్ర ప్ర భుత్వాలను ఆదేశించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments