Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్‌డౌన్ పొడగింపునకే మొగ్గు చూపుతున్న ప్రధాని మోడీ

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2020 (13:10 IST)
దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోడీ అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ చర్యల్లో భాగంగా మార్చి 24వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు తొలి దశ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 14 నుంచి మే 3వ తేదీ వరకు రెండో దశ లాక్‍డౌన్ కొనసాగుతోంది. ఇపుడు ఈ లాక్‌డౌన్ పొడగించాలా లేదా అనే విషయంపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొమ్మిది మంది ముఖ్యమంత్రుల సూచనలు, సలహాలు స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ పొడగింపునకే ప్రధాని మోడీ మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అధికార వర్గాల నుంచి అందుతున్న సంకేతాల మేరకు కొన్ని నిబంధనల సడలింపులు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఈ సమావేశంలో 9 మంది ముఖ్యమంత్రులు ప్రధానితో లాక్‌డౌన్‌పై తమ అభిప్రాయాలు పంచుకున్నారని తెలుస్తోంది.
 
వీరిలో అత్యధిక మంది సీఎంలు లాక్‌డౌన్‌ను పొడిగించాలని, అయితే, నిత్యావసరాలతో పాటు మరిన్ని విభాగాలను అనుమతించాలని సూచించినట్టు తెలుస్తోంది. అందరి అభిప్రాయాలనూ తీసుకున్న నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, పలు నగరాల్లో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మదింపు చేసిన కేంద్ర బృందాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. 
 
లాక్‌డౌన్ కొనసాగించాల్సిన ప్రాంతాలు, గ్రీన్‌జోన్ ప్రాంతంలో అనుమతించాల్సిన కార్యకలాపాలు, ప్రజా రవాణా ప్రారంభిస్తే, తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై నిర్ణయం తీసుకునే ముందు, మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేసి, కేసుల స్థితిని పరిశీలించాల్సి వుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
 
జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ 
ఇదిలావుంటే ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వారాంతంలో ఆయన ప్రసంగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. భారత్‌లో ప్రస్తుతం రెండో దశ లాక్‌డౌన్ కొనసాగుతోంది. రెండోదశ లాక్‌డౌన్ మే 3న ముగియనుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ మే 7 వరకూ ముందే లాక్‌డౌన్ పొడిగించారు. 
 
మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో  రోజురోజుకూ కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే లాక్‌డౌన్ పొడిగిస్తే ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బతినే అవకాశం ఉండటంతో కొన్ని సడలింపులు ఇస్తూ లాక్‌డౌన్ కొనసాస్తారని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments