Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్షకు దగ్గర్లో కరోనా కేసులు.. టాప్‌లో మహారాష్ట్ర.. 24 గంటల్లో 5వేల కేసులు

Webdunia
సోమవారం, 18 మే 2020 (12:18 IST)
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 5,242 కేసులు నమోదవగా, 157 మంది మృతిచెందారు. దీంతో దేశంలో కరోనా పాటిజివ్‌ కేసుల సంఖ్య 96,169కి పెరిగింది. దీంతో భారత్‌లో కరోనా కేసులు లక్షకు దగ్గరలో ఉన్నాయి. 
 
రోజు రోజుకి రికార్డు స్థాయిలో పాజిటివ్​ కేసులు వస్తున్నాయి. అయితే కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగించేదే అయినా, అదేస్థాయిలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరగడం కొంచెం ఊరటనిచ్చే విషయం. 
 
ఇక ఆదివారం ఒక్కరోజులేనే కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఈ ప్రాణాంతక వైరస్‌ వల్ల ఇప్పటివరకు 3029 మంది బాధితులు మరణించారు. దేశంలో ప్రస్తుతం 56,316 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 36,823 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
 
అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 33,053 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1198 మంది మరణించారు. గుజరాత్‌లో 11,379 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదగా, 659 మంది మృతిచెందారు.
 
తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 11,224కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 78 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో 10,054 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు 160 మంది మృతిచెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments