Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఆ సంఖ్య తగ్గింది.. మహారాష్ట్రలో 15,842మంది మృతి

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (23:06 IST)
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. తాజాగా 8,968 కొత్త కేసులు వెలుగుచూశాయి. 10,221 మంది డిశ్చార్జి అయ్యారు. 266 మరణాలు సంభవించాయి. మొత్తం కేసుల సంఖ్య 4,50,196కి చేరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
వీరిలో ఇప్పటి వరకు 2,87,030 మంది కోలుకోగా, 15,842 మంది మరణించారు. ప్రస్తుతం 1,47,018 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా 41,644 యాక్టివ్‌ కేసులు పుణె నగరంలోనే ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 
 
మహారాష్ట్ర తర్వాత కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మరో రాష్ట్రం తమిళనాడు. ఈ రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 5,609 కేసులు నమోదయ్యాయి. 109 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,63,222కి చేరింది. వీరిలో 2,02,283 మంది కోలుకొని డిశ్చార్జ్‌ కాగా, 4,241 మంది మరణించారు.
 
గడిచిన 24 గంటల్లో 58,211 నమూనాలను పరీక్షించినట్లు తమిళనాడు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ఇదేవిధంగా దేశ రాజధాని ఢిల్లీ, కర్ణాటకల్లో కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే భారత్‌లో కరోనా మరణాల సంఖ్య బాగా తగ్గుతుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే అతి తక్కువ మరణాలు నమోదవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మరణాలు 2.11శాతం మాత్రమే ఉన్నాయి. 
 
గడిచిన 24 గంటల్లో దేశంలో 40,574 కరోనా బాధితులు కోలుకోగా ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 11,86,203కు చేరింది. ఆవిధంగా చూసినప్పుడు పాజిటివ్‌గా తేలినవాళ్లలో కోలుకున్నవారి శాతం 65.77శాతానికి పెరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments