Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది : మంత్రి హర్షవర్ధన్

Webdunia
ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (17:12 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం పలు రకాలైన చర్యలు తీసుకుంటోంది. ఇందులోభాగంగా, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కూడా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా కొత్తకొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనా వైరస్ కేసుల వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ స్పందిస్తూ, దేశంలో 'కరోనా' వ్యాప్తి వేగం ఇప్పుడిప్పుడే తగ్గుతోందన్నారు. 
 
రెండు వారాల క్రితం 'కరోనా' కేసులు రెట్టింపు అయ్యేందుకు 6.2 రోజులు పట్టగా, ఆ తర్వాతవారం రోజుల్లో రెంట్టింపు అయ్యేందుకు 7.02 రోజులు పట్టిందని గుర్తుచేశారు. చివరగా, మూడు రోజుల ప్రకారం కేసుల రెట్టింపునకు 9.7 రోజులు పట్టవచ్చని చెప్పుకొచ్చారు. దీన్ని పరిశీలిస్తే కొత్తగా కరోనా కేసుల నమోదు వేగం క్రమంగా తగ్గుతోందని తెలిపారు. 
 
ఇకపోతే, ఆయా రాష్ట్రాల్లో చిక్కుకునిపోయిన వలస కూలీల అంశంపై హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా స్పందిస్తూ, వలస రాష్ట్రం దాటి వెళ్లేందుకు అనుమతి లేదన్నారు. స్వరాష్ట్రంలో ఉన్న వారు మాత్రమే పని ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. 
 
అదేవిధంగా క్యాంపుల్లో ఉన్న వలస కూలీల వివరాలను, వారు చేసే పని వివరాలను నమోదు చేయాలని సూచించింది. అవసరమైతే క్యాంపు సమీపంలోనే పనులు ఉంటే వారితో చేయించుకోవాలని,ఆహార, రవాణా సౌకర్యం కల్పించి పనులు కల్పించవచ్చని సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

ప్రతీ అమ్మాయి విజయం వెనుక ఓ అబ్బాయీ ఉంటాడు : డియర్ ఉమ సుమయ రెడ్డి

ఎన్టీఆర్, హృతిక్ నటించిన వార్-2 మొదటి మోషన్ పోస్టర్ మే లో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments