Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం... 48 మంది ఫైలట్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (22:45 IST)
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకున్నది. 48 మంది ఫైలట్లను తొలగిస్తూ గత అర్థ రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తొలగింపునకు గురైన వారు ఎయిర్ బస్ 320 ఫైలట్లు కావడం గమనార్హం. ప్రస్తుతం తొలగింపునకు గురైన 48 మంది ఫైలట్లు గతేడాది ఉద్యోగానికి రాజీనామా చేస్తూ ఆరు నెలల నోటీసులు ఇచ్చారు.
 
అయితే ఆ తర్వాత వారు తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. అర్థరాత్రి వేళ ఎయిర్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం కలకలం రేపింది. పైలట్ల తొలగింపు ఉత్తర్వులు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్వాల్‌ను ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోషియేషన్ కోరింది. కాగా తొలగింపునకు గురైన పైలట్లలో కొందరు ప్రస్తుతం విధులలో ఉండడం గమనార్హం.
 

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments