Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదివారం ఏం చేయకూడదో తెలుసా?

Advertiesment
ఆదివారం ఏం చేయకూడదో తెలుసా?
, శనివారం, 15 ఆగస్టు 2020 (18:47 IST)
అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||
 
స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధి శోక దారిద్ర్యం, సూర్యలోకం స గచ్చతి ||
 
తాత్పర్యం:
మాంసం తినడం,
మద్యం తాగడం,
స్త్రీతో సాంగత్యం,
 
తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించిన కర్మలు. ఇలా చేసినవాడు జన్మజన్మలకు దరిద్రుడు అవుతాడని అర్థం. మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు.
 
ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి. ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటివి చేయడం.. సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి.
 
అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో మార్చేశారు. పూర్వీకులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు. ఆ రోజు జీవహింస చేసి మాంసాన్ని తినే వారు కాదు మద్యాన్ని తాగే వారు కాదు. కానీ ఇప్పుడు అంతా ఇప్పుడు తలకిందులైంది. కాబట్టి ఆదివారం పూట సూర్యుడి ఆరాధనతో శుభ ఫలితాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15-08-2020- శనివారం మీ రాశి ఫలితాలు.. నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే?