Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

15-08-2020- శనివారం మీ రాశి ఫలితాలు.. నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే?

15-08-2020- శనివారం మీ రాశి ఫలితాలు.. నవగ్రహ స్తోత్ర పారాయణం చేస్తే?
, శనివారం, 15 ఆగస్టు 2020 (05:00 IST)
నవగ్రహ స్తోత్ర పారాయణం చేసినట్లైతే మనోసిద్ధి, సంకల్పసిద్ధి  చేకూరుతుంది. 
 
మేషం: మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలేర్పడతాయి. పాత రుణాలు తీరుస్తారు. కుటుంబీకులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థికంగా బాగుగా స్థిరపడినా ఆరోగ్యంలో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ మౌనం వారికి గుణపాఠం అవుతుంది. 
 
వృషభం: కోళ్ళ, మత్స్య, పాడి పరిశ్రమ రంగాల్లో వారికి చికాకులు అధికమవుతాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ఏదైనా విలువైన స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. దూర ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. దైవ, పుణ్య కార్యాల పట్ల శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. 
 
మిథునం: స్త్రీలకు తల, కాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. వ్యవసాయ రంగాల వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆటో మొబైల్, ట్రాన్స్‌పోర్ట్, మెకానికల్ రంగాల్లో వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. 
 
కర్కాటకం: హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఫ్యాన్సీ, రసాయనిక, సుగంధ, ద్రవ్య, మందులు వ్యాపారస్తులకు కలిసి వచ్చే కాలం. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
సింహం: నూనె, ఎండుమిర్చి, పసుపు, ప్రత్తి, పొగాకు కంది వ్యాపారస్తులకు కలిసి వచ్చేకాలం. రావలసిన ధనం అందకపోవడంతో ఇబ్బందులు తప్పవు. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్థత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. 
 
కన్య: ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. రుణం కొంత మొత్తం తీర్చడంతో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మార్కెటింగ్, ఆడిటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. 
 
తుల: దైవ దర్శనాలకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్, ఆడిటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. 
 
వృశ్చికం: వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. సోదరీ సోదరుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. భాగస్వామిక వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం వుంది. తప్పనిసరి చెల్లింపులు, ఆకస్మిక ఖర్చుల వల్ల స్వల్ప ఆటుపోట్లు ఎదుర్కొంటారు.
 
ధనస్సు: స్త్రీల ఆరోగ్యంలో మార్పు కానవస్తుంది. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ చాలా అవసరం. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. మీ అతిథి మర్యాదులు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ ధ్యేయం నెరవేరాలంటే ఓర్పు, పట్టుదలతో శ్రమించవలసి ఉంటుంది. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది.
 
మకరం: బంధువుల రాకతో పనులు ఆలస్యంగా అయినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీపై శకునాలు, చెప్పుడు మాటల ప్రభావం అధికం. అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. 
 
కుంభం: వ్యాపార రీత్యా ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. బంధుమిత్రుల రాకతో గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. విద్యార్థులకు విదేశీ చదువుల అవకాశం లభిస్తుంది. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. ఆందోళన కలిగించిన సమస్య పరిష్కారమవుతుంది. ఉపాధి పథకాల్లో స్థిరపడతారు.
 
మీనం: కళ, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. మీ ఆంతరంగిక విషయాలు, వ్యాపార, ఆర్థిక లావాదేవీలు గుట్టుగా ఉంచండి. చేజారిన అవకాశం తిరిగి లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మీ సంతానం ఆరోగ్య విషయంలో మెలకువ వహించండి. బంధువులు, అయిన వారితో పట్టింపులెదురవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో నూతన పరకామణి, భక్తులు నేరుగా లెక్కేయడం చూడొచ్చు