Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతి తక్కువ ఖర్చుతో కరోనా టెస్టు.. ఎంతో, ఎక్కడో తెలుసా?

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (10:09 IST)
మహమ్మారి కరోనా వైరస్‌ను నిర్ధారించే పరికరాన్ని అతి తక్కువ ఖర్చుతో ఐఐటీ ఖరగ్‌పూర్‌ ప్రకటించింది. తమ శాస్త్రవేత్తలు తయారు చేసిన పోర్టబుల్‌ ర్యాపిడ్‌ డయాగ్నోస్టిక్‌ పరికరంతో ఒక్కో టెస్టుకు కేవలం రూ.400 మాత్రమే ఖర్చవుతుందని తెలిపింది.

అంతేకాదు.. గంటలో ఫలితం తేలిపోతుందని పేర్కొంది. భారీ ఖర్చుతో కూడుకున్న ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని పరికరం తయారు చేసిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లోలాగే.. కచ్చితమైన ఫలితం ఈ పోర్టబుల్‌ ర్యాపిడ్‌ డయాగ్నోస్టిక్‌ పరికరంలో ఉందని తెలిపింది.

రూ.2000 ధర కలిగిన తమ పోర్టబుల్‌ ర్యాపిడ్‌ డయాగ్నోస్టిక్‌ పరికరంతో వైరస్‌ ఉనికి తెలుసుకోవటం చాలా సులభమని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని పరీక్ష విధానాల ధరల కంటే ఇదే అతి తక్కువ అని శాస్త్రవేత్తలు తెలిపారు.

పోర్టబుల్‌ ర్యాపిడ్‌ డయాగ్నోస్టిక్‌ పరికరం తయారీ, వ్యాపార పరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ ధర నిర్ణయించామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments