కరోనా వచ్చినా వదలరా? ఆగని కామాంధుల అకృత్యాలు.. నోయిడాలో?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (14:27 IST)
కామాంధుల ఆగడాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారులు, మహిళలపై దాడుల నిరోధానికి ఇప్పటికే పోక్సో చట్టం అమలులో వుండగా.. ఏపీలో ప్రభుత్వం దిశ చట్టాన్ని కూడా తీసుకువచ్చింది. అయినప్పటికీ కొందరు మృగాల్లో మార్పు రావడం లేదు. ఇక కరోనా సోకిన మహిళలను కూడా కొందరు నీచులు వదలడం లేదు. 
 
కరోనా సోకినా పర్వాలేదు.. కామవాంఛ తీర్చుకోవడమే పనిగా పెట్టుకుంటున్నారు. తాజాగా గ్రేటర్ నోయిడాలో ఓ ఆస్పత్రిలో ఇటీవలే 20 ఏళ్ల మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ప్రసవం అయిన కొద్ది రోజులకే ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో నోయిడాలోని శర్ధ హాస్పిటల్‌లో జాయిన్ అయింది. అక్కడ ఆమెకు కరోనా వున్నట్లు తేలింది. దీంతో ఆమెను ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.
 
అయితే ఆ ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెను దారుణంగా లైంగికంగా వేధించడం ప్రారంభించారు. దీంతో సహించలేని సదరు మహిళ ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇద్దరు సిబ్బందిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నట్టు తెలిపారు. 
 
మరోవైపు వారిని ఆస్పత్రి నిర్వహకులు విధుల నుంచి తొలగించారని తెలుస్తోంది. కాగా, ఇటీవలే ముంబైలో కరోనా వ్యాధికి గురైన మహిళపై ఒక డాక్టర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం