క్యాప్సికమ్‌లో విటమిన్ సి పుష్కలంగా వుంది. విటమిన్ ఎ, ఇ, బి6 వంటి ధాతువులు పుష్కలంగా వుండే క్యాప్సికమ్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. క్యాప్సికమ్‌లో కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా వుండటం వల్ల బరువు తగ్గేందుకు ఇది ఉపకరిస్తుంది. అందుకే బరువు తగ్గించాలనుకునే వారు క్యాప్సికమ్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. క్యాప్సికమ్ వృద్ధాప్య లక్షణాలను తొలగిస్తుంది.
చర్మ సమస్యలను ఇది దూరం చేస్తుంది. కీళ్ల నొప్పులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ధాతువులతో పొట్ట ఉబ్బసాన్ని నియంత్రించుకోవచ్చు. కంటికి క్యాప్సికమ్ ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపులో లోపాలను నయం చేస్తుంది. క్యాప్సికమ్ మధుమేహాన్ని దూరం చేస్తుంది.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో క్యాప్సికమ్‌ను సలాడ్లలో ఉపయోగించడం ఉత్తమం. క్యాప్సికమ్, క్యాబేజీ, ఉల్లికాడలు, కీర దోసను సలాడ్ల ఉపయోగించడం మంచిది. ఇందులో మిరియాలు, నిమ్మరసం చేర్చుకోవడం మంచిది. ఇందులోని విటమిన్ సి జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.