హోమాలు మంచివే.. ఆ పొగను పీల్చితే?

సోమవారం, 23 మార్చి 2020 (16:33 IST)
Homam
సాధారణంగా ఆలయాల్లో, గృహాల్లో పలురకాల హోమాలు చేస్తుండటం వినేవుంటాం. వివిధ కారణాల కోసం హోమాలను నిర్వహిస్తుంటారు. అయితే ఏ హోమం చేసినా.. అది మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. హోమంలో పలు మూలికలు, ద్రవ్యాలు ఉపయోగిస్తారు. చందనం చెక్కలు, నువ్వులు, నెయ్యి, కొబ్బరి వంటి ఇతరత్రా వస్తువులను ఉపయోగిస్తారు. 
 
హోమాల నుంచి వెలువడే పొగ ద్వారా గాలిలోని వ్యర్థాలు తొలగిపోతాయి. క్రిములు నాశనమవుతాయి. హోమాల నుంచి వెలువడే పొగను పీల్చడం ద్వారా నరాల బలహీనతను దూరం చేసుకోవచ్చు. హోమం నుంచి వచ్చే పొగ ద్వారా శరీరంలో రక్తాన్ని శుద్ధీకరిస్తుంది. అందుకే ఆయుర్వేద నిపుణులు హోమం జరిగేటప్పుడు ఆ పొగను పీల్చడం చేయాలని సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 23-03-2020 సోమవారం మీ దినఫలాలు