Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

23-03-2020 సోమవారం మీ దినఫలాలు

webdunia
సోమవారం, 23 మార్చి 2020 (05:00 IST)
మేషం : ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికం. ఫ్యాన్సీ, కిరాణా, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. చేపట్టిన పనులు ఎంతో శ్రమించిన కాని పూర్తికావు. సోదరులతో విభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడాల్సి వస్తుంది. 
 
వృషభం : భాగస్వామికులతో చర్చలు ఫలించవు. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. ఏ నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం చాలదు. కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. లక్ష్యసాధనకు బాగా శ్రమించాలి. దుబారా ఖర్చులు తెలియకుండా అవుతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు వ్యాపారాలు ఫర్వాలేదనిపిస్తాయి. 
 
మిథునం : దైవదర్శనాలు అనుకూలిస్తాయి. గృహమార్పుతో సంభవించే ఫలితాలను గమనిస్తారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదు. వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రముఖుల సిఫార్సులతో పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు పెరిగినా భారమనిపించవు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. 
 
కర్కాటకం : ఆత్మీయుల రాక సంతోషం కలిగిస్తుంది. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ప్రతి విషయంలోనూ అప్రమత్తమంగా ఉండాలి. వ్యవహారాల్లో ప్రతికూలతలు, ధననష్టం తప్పకపోవచ్చు. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేయగలుగుతారు. 
 
సింహం : ప్రేమికుల వ్యవహారం చర్చనీయాంశమవుతుంది. శుభకార్యాల్లో ఆత్మీయుల కలయిక సంతోష కలిగిస్తుంది. భాగస్వామిక, సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రయాణాల్లో మెళకువ అవసరం. దీర్ఘకాలిక రుణాల మొత్తంలో అధికభాగం తీర్చగలుగుతారు. ఖర్చులు పెరిగినా భారమనిపించవు.
 
కన్య : ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సహోద్యోగుల సహాయం లభిస్తుంది. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ పనివారలకు కలిసిరాగలదు. ప్రముఖ సంస్థల్లో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. పత్రికా రంగంలో వారికి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రింటింగ్ రంగాలవారికి ఒత్తిడి అధికమవుతుంది. 
 
తుల : మీ యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం లభిస్తుంది. ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. నిరుద్యోగులకు యత్నం ఫలిస్తుంది. ఎదుటివారి వ్యాఖ్యలు సవాలుగా తీసుకుంటారు. 
 
వృశ్చికం : ఉద్యోగస్తులకు పదోన్నతి, నగదు అవార్డు వంటి శుభపలితాలు ఉంటాయి. స్త్రీల ఆరోగ్యం కుదుటపడుతుంది. దంపతుల మధ్య కలహాలు తలెత్తే ఆస్కారం ఉంది. నూతన వ్యాపారాలకు కావలసిన వనరులు, అనుమతులు సమకూర్చుకుంటారు. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. 
 
ధనస్సు : బంధు మిత్రుల రాకపోకలు అధికం అవుతాయి. విద్యార్థినులలో మానసికధైర్యం, సంతృప్తి చోటుచేసుకుంటాయి. స్పెక్యులేషన్ లాభదాయకం. దూర ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచడం మంచిది. 
 
మకరం : విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం. సంతృప్తినిస్తుంది. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో స్వల్ప ఒడిదుకుడులు వంటివి తలెత్తుతాయి. మీ అవసరాలకు కావాల్సిన ధనం సర్దుబాటు కాగలదు. వాహనం విలువైన గృహోపకరణాలు అమర్చుకుంటారు. 
 
కుంభం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి పనిభారం అధికం. కుటుంబ పరిస్థితుల ప్రోత్సాహకరంగా ఉంటాయి. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు యత్నాలు కలిసిరాగలవు. సిమెంట్, ఐరన్, ఇటుక వ్యాపారులకు నిరుత్సాహం తప్పదు. విద్యార్థినులకు ఒత్తిడి, ఆందోళన తప్పవు. 
 
మీనం : కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు, విద్యా విషయాలపై ఏకాగ్రత వహిస్తారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైనందిన కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీల శ్రమకు తగిన గుర్తింపు లభించును. ఖర్చులు కొంతవరకు నియంత్రణ చేయగలుగుతారు. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

22-03-2020 ఆదివారం మీ దినఫలాలు...