Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

22-03-2020 ఆదివారం మీ దినఫలాలు...

Advertiesment
22-03-2020 ఆదివారం మీ దినఫలాలు...
, ఆదివారం, 22 మార్చి 2020 (05:00 IST)
మేషం : ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. శ్రీవారు, శ్రీమతుల గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే పరిణామాలు ఎదుర్కుంటారు. వ్యాపారుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ముక్కుసూటిగా పోయే మీ తీరు ఇబ్బందులకు దారితీస్తుంది.
 
వృషభం : స్థిరాస్తిని అమ్మటానికి చేయు ప్రయత్నంలో పునరాలోచన మంచిది. చిట్స్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాల వారికి ఖాతాదారులతో సమస్యలు అధికమవుతాయి. బంధువులను కలుసుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనం విరివిగా వ్యయం చేసి అయిన వారిని సంతృప్తి పరుస్తారు.
 
మిథునం : గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, నూతన వ్యాపారాలు, సంస్థల స్థాపనలు త్వరలోనే అనుకూలిస్తాయి. భాగస్వాముల మధ్య అనవసరపు విషయాలు చర్చకు రావటం వలన ఇబ్బందులు తప్పవు.
 
కర్కాటకం : కుటుంబ, ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. ఎంతటి చిక్కు సమస్యనైనా తేలికగా పరిష్కరిస్తారు. అసాధ్యమనుకున్న దానిని సాధించి మీ సత్తా చాటుకుంటారు. మీ శ్రమకు తగిన పారితోషకం లభిస్తుంది. మీ సంతానం విషయంలో మెళకువ అవసరం. షాపింగ్ కోసం ధనం వెచ్చిస్తారు.
 
సింహం : రవాణ రంగాలలోని వారికి సంతృప్తి కానవస్తుంది. తలపెట్టిన పనిలో ఆటంకాలు వంటివి ఎదుర్కుంటారు. పాత మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. తోటలు కొనుగోలుకై చ్యు ప్రయత్నాలు వాయిదాపడుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కన్య : ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు వాయిదాపడతాయి. ముఖ్యమైన విషయాలలో చురుకుదనం కానవస్తుంది. ముఖ్యమైన వస్తువులు అమర్చుకుంటారు. కుటుంబీకులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి, మెళకువ వహించండి.
 
తుల : ఆర్థిక ఇబ్బందులు లేకున్నా అసంతృప్తి మిమ్మల్ని వెన్నంటుతుంది. హామీలకు, వాదోపవాదాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. స్త్రీలకు టి.వి. ఛానెళ్ళ నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. సన్నిహితులతో చర్చలు, వినోదాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికం : కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. మత్స్య, కోళ్లు, గొర్రెల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయాలలో వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. స్త్రీలకు ఆరోగ్య, ఆథ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఖర్చుల వల్ల రుణ యత్నాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు.
 
ధనస్సు : ఓర్పు, మనోధైర్యంతో మీ యత్నాలు సాగించండి. దైవ, సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. భాగస్వామిక, సొంత వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. సభ సమావేశాల్లో పాల్గొంటారు.
 
మకరం : ఏదైనా స్థిరాస్తి అమ్మకం వాయిదా వేయటం మంచిది. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. మీ అభిప్రాయాలకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. నూతన పెట్టుబడుల విషయంలో మెళకువ అవసరం.
 
కుంభం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. మీ కార్యక్రమాలు సమయానుకూలంగా మార్చుకోవలసి ఉంటుంది. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనపడుతుంది. బంధుమిత్రులతో రహస్య సంభాషణలు కొనసాగిస్తారు. పరిశోధనాత్మక విషయాలపై ఆసక్తి చూపుతారు.
 
మీనం : కుటుంబంలోనూ, బయటా ఊహించిన సమస్యలు తలెత్తుతాయి. పాత మిత్రుల కలయిక మీలో సెతోషం వెల్లివిరిస్తుంది. ముఖ్యమైన పనులలో ఏకాగ్రత వహిస్తారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. తలచిన పనులలో కొంత అడ్డంకి ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

22-03-2020 నుంచి 28-03-2020 మీ వార రాశిఫలాలు