కోజికోడ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (23:13 IST)
కేరళలోని కోజికోడ్ విమానశ్రయంలో ల్యాండ్ అవుతున్న విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేబుల్ టాప్ వంటి ఆ విమానశ్రయంలో విమానం రన్ వే మీద నుంచి జారిపోయి రెండు ముక్కలైంది. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ప్రమాద సమయంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరు పైలట్లతో సహా మొత్తం 18 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
 
విమానంలో చిక్కుకొని పోయిన వారిని వెలికి తీసేందుకు దాదాపు 3 గంటలకు పైగా సమయం పట్టింది. మరో వైపు రెస్క్యూ ఆఫరేషన్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మలప్పురం వైద్యులు తెలిపారు.
 
రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత వీరిని క్వారంటైన్‌కు తరలించాలని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులతో పాటు దాదాపు 600 మందిని క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించారు. వీరిలో ఎంతమంది కరోనా బారిన పడ్డారనే విషయంపై జిల్లా వైద్యాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments