Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ఎఫెక్ట్... హీరో కంపెనీ ద్విచక్ర వాహనాల తయారీ నిలిపివేత.!

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (10:30 IST)
కరోనా సెకండ్‌ వేవ్‌ నేపధ్యంలో మళ్లీ పలు రంగాలు మూతపడే పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో... దేశీయ అతిపెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ... హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తీసుకుంది.

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని తయారీ యూనిట్లలోనూ వాహన తయారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. గురువారం(ఏప్రిల్‌ 22) నుంచి మే ఒకటి వరకు ప్రతీ మేనిట్‌లోనూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

యూనిట్ల నిలిపివేత సమయంలో మెయింటెనెన్స్‌ పనులు పూర్తి చేసుకుంటామని వెల్లడించింది. కాగా... కంపెనీకి చెందిన అన్ని కార్పొరేట్‌ ఆఫీసులు ఇప్పటికే మూసివేసి ఉన్నాయి. ఇక... ఉద్యుగులు ‘వర్క్‌ఫ్రం హోం’ ద్వారా విధులు నిర్వర్తిస్తున్నారు. 

కంపెనీ వాహన తయారీ నిలుపుదల కారణంగా డిమాండ్‌పై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడబోదని హీరో కంపెనీ తెలిపింది. షట్‌డౌన్‌ తర్వాత ప్రతీ ప్లాంట్‌లోనూ తయారీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని వెల్లడించింది.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments