Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనాను సమష్టిగా ఎదుర్కొందాం, విజయవాడ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్

Advertiesment
కరోనాను సమష్టిగా ఎదుర్కొందాం, విజయవాడ జిల్లా కలెక్టర్ ఇంతియాజ్
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (22:12 IST)
విజ‌య‌వాడ‌: ప్రస్తుత అసాధరణ పరిస్థితిలో కరోనాను సమిష్టిగా ఎదుర్కొనడానికి వ్యాపార, వర్తక సంఘాలు తమ సహకారన్ని అందించాలని కృష్ణాజిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ కోరారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బుధ‌వారం సాయంత్రం కరోనా కట్టడికి, తీసుకోవాల్సిన చర్యలపై వర్తక, వ్యాపార సంఘాల ప్రతినిధులతో నగర పోలీస్ కమిషనర్ బ‌త్తిన శ్రీనివాసులు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్‌తో కలసి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సమీక్షించారు.
 
ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కరోనా సెంఖండ్ వేవ్ వైరస్ వలన మానవళి అనేక ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ అన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ స్వచ్చందగా కోవిడ్ నియంత్రణకు తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.

గతంలో జిల్లాలో కోవిడ్ నియంత్రణకు తీసుకున్న చర్యలకు వ్యాపార వర్తక వర్గాలు బాగా సహకరించారని, ప్రస్తుత పరిస్థితులో కూడా జనసమూహల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున వ్యాపార వర్తక సంఘాలు తక్కువ మంది ప్రజలను అనుమతించే విధంగా, డోర్ డెలివరి, టేప్స్ వే, అలైన్ మొదలగు చర్యల ద్వారా తమ వ్యాపారాలను కొన్నసాగిస్తే కొంతవరకు సహకరించిన వారు అవుతారని కలెక్టర్ అన్నారు.

“నోమాస్క్ - నోఎంట్రీ”ని వ్యాపార, వర్తక సంస్థలో కట్టుదిట్టంగా అమలు చేయాలన్నారు. పోలీస్ క‌మిష‌న‌ర్ శ్రీనివాసులు మాట్లాడుతూ కోవిడ్ వైరస్ పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్త గా ఉండాలని మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ లేక సబ్బుతో చేతులను శుభ్రపరచుకోవాలని, ఈ పద్ధతిని ప్రతి ఒక్కరూ అలావాటుగా మార్చుకోవాలన్నారు. గత 20 రోజులుగా విజయవాడ పోలీస్ కమీషనరేట్ పరిధిలో మాస్క్ లేకుండా ప్రయాణిస్తున్న 50 వేల మందికి జరిమానా విధించామన్నారు.

నగరంలో వ్యాపార వర్తక సంస్థల్లో జనం రద్దీ ఎక్కువగా ఉంటుందని వీరి ద్వారా వైరస్ ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని, ఇందుకు ఆయా సంఘాల ప్రతినిధులు తమ వినియోగదారులకు మాను అందించడం మొదలగు కొవిడ్ జాగ్రత్తలు పాటించేలా ఏర్పాట్లు చేయాలని, తమ షాపులకు ఎక్కువ మందిని అనుమతించరాదని పోలీస్ కమిషనర్ అన్నారు. సమావేశంలో విజయవాడ నగర కార్పొరేషన్ కమిషనర్ వి.ప్రసన్న వెంకటేష్, నగరంలోని వివిధ వ్యాపార వర్తక సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో పెన్షన్ కోసం కొత్త రూల్స్