కరోనా కేసులు భారీగా తగ్గాయి! కేర‌ళ‌లోనే భూతం!!

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (11:49 IST)
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. గత కొద్దిరోజులుగా అదుపులో ఉంటున్న కొత్త కేసులు.. తాజాగా 10 వేలకు పడిపోయాయి. ఫిబ్రవరి నెల మధ్యనాటికి  క్షీణించాయని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

 
సోమవారం 10,09,045 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,423 మందికి పాజిటివ్‌గా తేలింది. దాదాపు ఎనిమిదిన్నర నెలల తర్వాత ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. నిన్న 15,021 మంది కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటివరకూ 3.42 కోట్ల మందికి వైరస్ సోకగా.. 3.36 కోట్ల మందికి పైగా మహమ్మారి నుంచి బయపటపడ్డారు.

 
కొత్త కేసులు అదుపులో ఉండటంతో క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం ఆ కేసుల సంఖ్య 1,53,776గా ఉంది. గత 250 రోజుల్లో ఇదే అత్యల్పం.  క్రియాశీల కేసుల రేటు 0.45 శాతానికి తగ్గగా.. రికవరీ రేటు 98.21 శాతానికి పెరిగింది.

 
 కేరళ గణాంకాలను సవరిస్తుండటంతో.. మృతుల సంఖ్యలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నిన్న 443 మరణాలు నమోదుకాగా.. అందులో 368 కేరళలో రికార్డయినవే. ఇప్పటివరకు కరోనా కారణంగా 4,58,880 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోపక్క నిన్న 52 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 106 కోట్ల మార్కును దాటింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments